Liquor shops closed Today: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ రోజు వైన్స్ బంద్!

Liquor shops closed Today: ముందు బాబులకు బ్యాడ్ న్యూస్. ఈ రోజు నగరంలో వైన్ షాపులు మూసివేయనున్నారు. 23 ఉదయం 6:00 నుంచి 24 ఉదయం 6:00 వరకు మద్యం షాపులు మూసివేయనున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి తెలిపారు.

హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం శోభాయాత్రను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ శోభాయాత్ర గౌలిగూడలోని రాంమందిర్ నుంచి సికింద్రాబాద్ తాడ్ బంద్ హనుమాన్ ఆలయం వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లోని బార్లు, మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే శోభాయాత్ర రూట్ మ్యాప్ ను పోలీసులు ఇప్పటికే పరిశీలించారు. ఈ యాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాత్ర కొనసాగే అన్ని ప్రాంతాల్లోను భారీగా బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో 23వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్, బార్ షాప్స్ మూసివేస్తున్నట్లు సీపీ అవినాష్ మొహంతి వెల్లడించారు. శోభాయాత్ర నేపథ్యంలో నగరంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మద్యం షాపులను బంద్ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా సరే నిబంధనలను అతిక్రమించి మద్యం దుకాణాలు తెరిచి అమ్మకాలు చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Share post:

లేటెస్ట్