TG NEWS: తెలంగాణ ప్రజలకు సర్కారు గుడ్ న్యూస్ ప్రకటించింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలోనే కసరత్తులు మొదలుపెట్టబోతున్నట్లు తెలిపారు.
Telangana: కొంతకాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని చూస్తున్న వారి కోరిక నేరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రజా పాలన పేరుతో లబ్దిదారులనుంచి దరఖాస్తులు సేకరించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
ఎన్నికలు ముగిసిన వెంటనే..
ఈ మేరకు లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం నాగార్జున సాగర్ సెగ్మెంట్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. తెలంగాణలో కాంగ్రెస్‌కు పోటీ లేదన్నారు. 14 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదని, నల్లగొండ, భువనగిరిలో ఆ రెండు పార్టీలు గల్లంతు కావడం ఖాయమన్నారు. అలాగే మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని అయితే దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని విమర్శించారు.