మన ఈనాడు: ఉద్యమ నాయకుడుగా తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు..మాజీ సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడిగా ఉంటూ..గులాబీతో తెగదెంపులు చేసుకుని కాషాయం గూటికి చేరి క్రీయశీలకంగా వ్యవహరిస్తున్న నాయకుడు. అసెంబ్లీలో రెండు చోట్ల పోటీ చేసి ఊహించని విధంగా ఓటమి చెందిన ఈటల రాజేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది.
తెలంగాణ లో మరోసారి ఎన్నికల హడావిడి షూరూ అయిందనే చెప్పవచ్చు. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించేందుకు కసరత్తులు చేస్తున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎంపీ బరిలో నిల్చువాలనుకునే వారు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకోవాలని సూచించడం తో హస్తం ఆశవాహులు నేతలు దరఖాస్తులు చేసుకున్నారు.
కమలం నేతలు సైతం అభ్యర్థుల ఎంపిక లో తలమునకలు అయ్యారు. కాగా అసెంబ్లీ బరిలో హుజురాబాద్ , గజ్వెల్ స్థానాల నుండి పోటీ చేసి ఓటమి చెందిన ఈటెల..ఈసారి పార్లమెంట్ బరిలో నిల్చుబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుపైనా ఆయన స్పందించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు సాధ్యపడదని తేల్చిచెప్పారు. మరి ఈటెల ఎక్కడినుండి పోటీ చేస్తారనేది చూడాలి. మల్కాజిగిరి పార్లమెంట్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది.