Telangana: ‘ఇందిరమ్మ కానుక’కి రంగం సిద్దం..ఆడబిడ్డలకు తులం బంగారం అప్పటి నుంచే..

మన ఈనాడు: తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి స్థానంలో ‘ఇందిరమ్మ కానుక’ పథకాన్ని ప్రారంభించనుంది. అయితే, ఈ పథకం ఎప్పుడొస్తుంది? ఎంత నగదు ఇస్తారు? చెప్పినట్లుగా బంగారం ఇస్తారా? డబ్బు ఇస్తారనే సందేహం ప్రజల్లో నెలకొంది. పథకం అమలుపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telangana Indiramma Kanuka: యావత్ తెలంగాణ సమాజం.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తుంది. కొందరైతే.. ఇప్పుడు పెళ్లి చెయ్యాలా? కొంతకాలం ఆగి చెయ్యాలా? అని ఆలోచిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే.. గత ప్రభుత్వం ఇచ్చిన కల్యాణ లక్ష్మి పథకాన్ని.. కొత్త ప్రభుత్వం అమలు చేస్తుందా? లేదా? అన్న సందేహంతోనే. ఎన్నికల వేళ కల్యాణి లక్ష్మి తరహాలోనే ఇందిరమ్మ కానుక పేరుతో పథకం ప్రారంభిస్తామని హామీని ప్రకటించింది కాంగ్రెస్. ఈ పథకం కింద.. హిందూ, మైనారిటీ ఆడపడుచుల వివాహానికి రూ. రూ. లక్ష నగదుతో పాటు.. తులం బంగారం కూడా ఇస్తామని ప్రకటించింది. దాంతో ఈ పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుందా? కల్యాణ లక్ష్మికి కొనసాగింపుగా ఇస్తారా? లేక కొంతకాలం తరువాత ఇందిరమ్మ కానుకను అమలు చేస్తారా? అని సందిగ్ధంలో ఉన్నారు జనాలు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అని ఎదురు చూస్తున్నారు.

ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే.. ఇందిరమ్మ కానుక పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మతాలు, వర్గాల ఆడ బిడ్డల పెళ్లికి కళ్యాణ లక్ష్మి తరహాలోనే ‘ఇందిరమ్మ కానుక’ను ఇస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఈ పథకం కింద ఆడబిడ్డలకు రూ. లక్ష నగదు, తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. దాంతో సీఎం ఎలాంటి ప్రకటన చేస్తారా? అని ఉత్కంఠ నెలకొంది.

Share post:

లేటెస్ట్