మనEnadu: ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ (Former Minister Babu Mohan) ప్రజా శాంతి పార్టీలో (Praja Shanthi Party) చేరారు.
సోమవారం పార్టీ చీఫ్ కేఏపాల్ (Praja Shanthi Party Chief KA Paul) సమక్షంలో బాబుమోహన్ పార్టీ కండువా కప్పుకున్నారు. కొద్ది రోజుల క్రితం బీజేపీకి (BJP) గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి.. ఈరోజు ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో బాబు మోహన్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల(Loksabha Elections 2024) నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ తరపున వరంగల్ (Warangal) నుంచి బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ప్రచారం ప్రారంభించి కచ్చితంగా విజయం సాధిస్తామని బాబు మోహన్ ధీమా వ్యక్తం చేశారు.