చింతకానిలో పురాతన దేవాలయం..కోర్కెలు తీర్చే శ్రీచెన్నకేశవుడు

మన ఈనాడు: 500ఏళ్ల నాటి పూరాతన దేవాలయం..కోట్ల విలువ చేసే ఆస్తులు..తనను కొలిచే భక్తుల కోర్కెలు తీర్చే స్వామివారిగా గుర్తింపు పొందిన చింతకాని శ్రీచెన్నకేశవస్వామి దేవాలయం . ఖమ్మం జిల్లా కలెక్టర్​ నుంచి 10కిలోమీటర్లు దూరంలో ఉన్న చింతకాని గ్రామంలో పచ్చని పంటపొలాల మధ్య వెలిసిన చెన్నకేశవ స్వామి దేవాలయం చరిత్ర తెలుసుకుందాం.

నీళాదేవి, భూదేవి సహితముగా ఆలయంలో శ్రీచెన్నకేశవస్వామి వెలిశారు. కుడి చేతిలో శంకము, ఎడమ చేత చక్రం ధరించి వైకుంఠము నుండి దిగివచ్చిన శ్రీమన్నారాయణుడి వలె భక్తులకు ఆయన దర్శనిమిస్తారు. నిత్యపూజలు అందుకుంటున్న చెన్నకేశవుడు ప్రతి ఏటా జనవరి 14న గోదాదేవితో చెన్నకేశవుడు కల్యాణం ఘనంగా జరుగుతుంది. అంతేగాకుండా ఏడాదికోసారి వచ్చే హోళి పున్నం నాడు బ్రహ్మోత్సవ కల్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తుంది.

శ్రీచెన్నకేశవస్వామి ప్రధాన ద్వారం ఎదురుగా ఆంజనేయులు స్వామి దర్శనమిస్తారు. దేవాలయంలోకి వచ్చే ఎంట్రన్స్​లోనే పూర్వీకులు చెక్కిన నంది, రాతితో నిర్మించిన దేవాలయంలో సుందరమైన శిల్పాలు జ్ఞాపకాలు కనిపిస్తుంటాయి. ప్రతి శనివారం దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తుంటారు.

దేవాలయ భూమికి ఎకరాకు రూ.10వేల 500లు కౌలు రూపంలో ఆదాయం వస్తుంది. మరో 60ఎకరాలకు ప్రతి ఏటా దేవదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఆక్షన్​ ద్వారా ఎకరాకు నిర్ణయించే రూ.20వేలకు వేలం పలకుతుంది. ఏడాది రూ.22లక్షలపైగానే ఆదాయం వస్తుంది.

పూర్వికులు కేశావపురం అగ్రహారికులు శ్రీచెన్నకేశవస్వామి వారిసేవలు చేసే భాగ్యం బెల్లంకొండ వంశానికి దక్కింది.ఆనాడు మహావైభవంగా వెలుగొందిన ఈ దేవాలయం 30ఏళ్ల క్రితం దూప, దీప నైవద్యాలు పెట్టలేని దయనీయ పరిస్థితి నెలకొంది.

తొలుత ఆలయం కేశావపురం పేరుతో ప్రసిద్ది చెందింది. ఆలయానికి వందలాది ఎకరాల సాగుభూమి కేశావాపురం పేరుతోనే ఉన్నాయి. 500ఏళ్ల క్రితమే ఆలయం నిర్మించడం జరిగింది. 250 ఎకరాల సాగుభూమి ఉన్నది. బెల్లకొండ రంగచార్యులు కుటుంబం ఆలయానికి రాసిసిచ్చిన భూములు రెవన్యూ రికార్డులలో నమోదు కాబడ్డాయి. దేవాలయానికి సమీపంలో గ్రామాల రైతులకు భూము సాగు చేసేందుకు కౌలుకి ఇచ్చేవారు.

1953సంవత్సరంలో టెనన్సీ యాక్టు రావడంతో కౌలుదారులకు హక్కులు సంక్రమించాయి. క్రమంగా రైతులు కౌలు చెల్లించకపోవడంతో 20ఏళ్లు ఆలయ నిర్వాహణ భారంగా మారింది.

1990లో ప్రిన్సిపాల్​గా పనిచేస్తున్న రంగాచార్యులు రిటైర్ట్​ కావడంతోనే చింతకాని గ్రామంలోనే ఉంటూ యువజన సంఘం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దేవాలయం అభివృద్ధికి అలుపెరగని కృషి చేశారు.

1992ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటు చేశారు. కిలారు శ్రీకళ అధ్యక్షతన ధర్మకర్త మండలి  ఎకరాకు రూ.వంద కౌలు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. కానీ రైతులు నుంచి స్పందన లేదు. తర్వాత ఆలయ భూములను దేవదాయశాఖ గుర్తించి నోటీసులు ఇచ్చారు.

1995లో జూన్​ నెలలో ఆలయ ద్వజస్తంభన ప్రతిష్ట కోసం ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత కార్యక్రమంలో అప్పటి యవ నాయకుడు గ్రామ సర్పంచ్​ బండి రత్నాకర్​ ఆధ్వర్యంలో 1996లో ధ్వజస్తంభ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది.

కొరిన కోర్కెలు తీర్చే శ్రీచెన్నకేశవుడు

తనను నమ్ముకుని శరణు వేడిన భక్తులకు కోర్కెలు తక్షణమే తీర్చిన ఘటనలు ఎన్నో ఉన్నాయానే పేరుంది. హైదరాబాద్​కు చెంది శ్రీనివాసాచార్యులు తన కొడుకు మెడికల్​ సీటు రావలని కొరుకున్నాడు. సీటు రాగానే స్వామివారికి వెండితొడుగు సమర్పించాడు. యాఖాబులీ తన కూతురు సంతానం కోసం మొక్కుకున్నాడు. సంతానం కాగానే వెండితోట్టే సమర్పించాడు. ఇలా స్థానికుండా నివసించే గంగనబోయిన ఆంజనేయులు పెద్ద కొడుకు సంతానం లేకపోవడంతో స్వామివారిని సంతానం కలగాలని వేడుకున్నారు. ఆతర్వాత తన కొడుకుకి కొడుకు జన్మించడంతో స్వామివారి పేరునే తన మనవడికి కేశవుడుగా నామకరణం చేశారని చెప్పే మాటలుగా నిలువెత్తు సాక్ష్యం నిలిచింది.

ఖమ్మం –విజయవాడ రైలు మార్గంలో ఉదయం, సాయంత్రం వేళలలో ప్యాసింజర్​ చింతకాని రైల్వేస్టేషన్​ దిగి చేరుకోవచ్చు. బస్సు మార్గంలో ఖమ్మం కలెక్టరేట్​ నుంచి చింతకాని బస్సు లేదా ఆటోలో వెళ్లి దర్శనం చేసుకోవచ్చు.

Share post:

లేటెస్ట్