లోక్ సభ ఎన్నికల తరువాత ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి జైలు వెళ్లడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం సమంజసం కాదని అన్నారు.
కాంగ్రెస్ లో ఏకనాథ్ షిండే నే సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఓటుకు నోటు కేసు (Vote Ku Note Case) చివరి దశకు వచ్చిందని, వాటికి పూర్తి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జైలుకు పోక తప్పదని జోస్యం చెప్పారు, ఆ కేసును తప్పించుకునేందుకు సీఎం ఏకనాథ్ షిండేగా మారతారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అహంకార మాటలకి వారి మంత్రులే ఎదురు తిరిగే రోజులు వస్తాయని అన్నారు.
గత ప్రభుత్వం హయాంలో చేసిన పనులను వారి ఖాతాలో కాంగ్రెస్ నేతలు వేసుకుంటారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన పనులు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు వీటన్నిటిని చూసి నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు.
ప్రజల్లో జగన్‌పై నమ్మకం పోయింది.. అందుకే విజయసాయి రాజీనామా: Sharmila
YCP సీనియర్ నేత, రాజ్యసభ MP విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) ఇవాళ తన పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా(Resignation) సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాపై APCC నేత వైఎస్ షర్మిల(YS Sharmila) స్పందించారు. మాజీ సీఎం, YCP…