HYD|హైదరాబాద్​ ట్రాఫిక్​ కొత్త రూల్స్​

Hyderabad Traffic : హైదరాబాద్(Hyderabad) లో ట్రాఫిక్ అంటే పద్మవ్యూహం గుర్తుకు వస్తుంది. ఉదయం వెళ్తే ఇంటికి చేరేవేరే ఏ సమయం అవుతుందో అర్థం కాదు. ఆఫీసులకు వెళ్లేవారు ఒక గంట ముందుగానే వెళ్తే తప్పా సమయానికి చేరుకోలేరు. ఒక్కొక్కరిది ఒక్కో తిప్పలు. అయితే ట్రాఫిక్(Traffic) ను కంట్రోల్ చేసేందుకు సరికొత్త రూల్స్(New Rules) సిద్ధం చేశారు నగర పోలీసులు. లారీలు, ట్రక్కులు, టస్కర్లు, ట్రాలీలకు పగటపూటి సిటీలోకి అనుమతి ఉండదు. రాత్రి వేళలోనూ వాటికి కేటాయించిన రూట్లలో మాత్రమే అనుమతిస్తారు. కన్ స్ట్రక్షన్ ఎక్వీప్ మెంట్ వెహికల్స్ కూడా పగటి వేళలో నగరంలోకి అనుమతించరు. కేవలం రాత్రి 11గంటల నుంచి ఉదయం 7గంటలలోపు వరకే వాటిని సిటీలోకి అనుమతి ఇస్తారు.

ఏచర్, డీసీఎం, స్వరాజ్ మజ్దా వంటి మీడియం గూడ్స్ వెహికల్స్ కి ఉదయం 8 నుంచి 12లోపు సాయంత్రం 4 నుంచి 9లోపు సిటీ రోడ్లపైకి అనుమతి నిరాకరించారు. 2 టన్నులకు మించి నిర్మాణ వ్యర్థాలు తరలించే వాహనాలు ఉదయం 9 నుంచి 11.30 వరకు సాయంత్రం 5 నుంచి రాత్రి 10గంటల వరకు జంట నగరాలు రోడ్ల మీదకు పోలీసులు పర్మిషన్ నిరాకరించారు.

ఇక పది టన్నులకు మించి తరలించే ప్రభుత్వ వెహికల్స్(Government Vehicles) కు ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు అనుమతి ఇవ్వలేదు. అయితే ఆర్టీసీ బస్సులు(RTC Buses), ప్రభుత్వ ఏజెన్సీల బస్సులకు ఈ రూల్స్ వర్తించవని ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) తెలిపారు.

Share post:

లేటెస్ట్