Mana Enadu : తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (Sajjanar) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆన్ లైన్ వేదికగా జరుగుతున్న ఆర్థిక నేరాలు, మోసాల గురించి తరచూ ఆన్ లైన్ వేదికగా ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ముఖ్యంగా ఆన్ లైన్ బెట్టింగ్ (Online Betting) లు, రుణ యాప్ ల ద్వారా సమస్యల్లో చిక్కుకుంటున్న వారి గురించి తెలియజేస్తూ అందరిని అప్రమత్తం చేస్తుంటారు. తాజాగా సజ్జనార్.. బెట్టింగ్ యాప్‌లపై సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్టు పెట్టారు.
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని వీసీ సజ్జనార్ (VC Sajjanar) అన్నారు. కాసులకు కక్కుర్తిపడి వాటికి ప్రచారం చేయొద్దని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సూచించారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని.. ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో పోస్టు చేసే వీడియోల వల్ల అమాయకులు ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారికి బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వాపోయారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లరా!! కాసులకి కక్కుర్తి పడి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేయకండి.
రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని.. మీరు సోషల్ మీడియాలో వదిలే ఇలాంటి వీడియోల వల్ల అమాయకులు ఆన్ లైన్ బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులు అవుతున్నారు.… pic.twitter.com/xfILzcR5Mm
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 30, 2024
‘‘స్వలాభం కోసం ప్రజా శ్రేయస్సును విస్మరించడం ఎంత వరకు సమంజసం? సమాజ క్షేమం పట్టని మీ పెడధోరణులు క్షమించరానివి.కష్టపడకుండానే కాసులు పోగేసుకోవాలన్న ఆలోచన అనర్థం. అది యువత గుర్తించాలి. స్వార్థ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల (Social Media Influencers) మాటలు నమ్మి ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో పడి జీవితాలు నాశనం చేసుకోకండి. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులకు దూరంగా ఉండండి’’ అని సజ్జనార్ ఎక్స్ వేదికగా అప్రమత్తం చేశారు.







