తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. మన్నటి వరకూ రోడ్ షోలు నిర్వహించిన కేటీఆర్ తన ప్రచారంలో సరికొత్త శైలిని అవలంభిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోలో పర్యటించి తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. తీవ్ర రద్దీ నడుమ ఐరన్ రాడ్డును పట్టుకొని నిలుచున్నారు. ఒక ప్రయాణికుడితో ఎన్ని రోజులు అయింది హైదరాబాద్‌కి వచ్చి అని ప్రశ్నించారు.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. మన్నటి వరకూ రోడ్ షోలు నిర్వహించిన కేటీఆర్ తన ప్రచారంలో సరికొత్త శైలిని అవలంభిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోలో పర్యటించి తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. తీవ్ర రద్దీ నడుమ ఐరన్ రాడ్డును పట్టుకొని నిలుచున్నారు. ఒక ప్రయాణికుడితో ఎన్ని రోజులు అయింది హైదరాబాద్‌కి వచ్చి అని ప్రశ్నించారు. ఆయనతోపాటూ ప్రయాణించిన వారు కేటీఆర్‌ను తమ ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీసుకుంటూ సందడిగా గడిపారు. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.