మన ఈనాడు:తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఎమ్మెల్యే కారు ఢీకొట్టడంతో బోల్తా పడిన ఘటన జరిగింది. ఆ సమయంలో శాసనసభ్యుడు(MLA) హైదరాబాద్ నుంచి ధర్మపురి వైపు వెళ్తున్నారు.
యెండపల్లి మండలం అంబారిపేట సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ గాయపడ్డారు.
లక్ష్మణ్ కుమార్‌కు తల, కాళ్లు, చేతులపై గాయాలు కాగా, అతని ఇద్దరు గన్‌మెన్‌లకు కూడా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ ఉమాసాగర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యేతో పాటు గాయపడిన వారిని కరీంనగర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.