కారుకు సీటు క‌ష్ట‌మే..పొంగులేటి చేతిలో ఖ‌మ్మం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో త‌న రాజ‌కీయ జీవితం ప్రారంభించారు. క‌మ్యూనిస్టుల కంచుకోట‌లో..అది తెలంగాణ సెంటిమెంట్ బ‌లంగా వీస్తున్న రోజుల్లోనే ఖ‌మ్మం పార్ల‌మెంట్ గెలిచిన ఏకైక వ్య‌క్తి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి. త‌ర్వాతి రాజ‌కీయ ప‌రిస్థితుల్లో భాగంగా కారు గూటికి చేరారు. 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేసీఆర్ మాట కోసం త‌న స్థానాన్ని వ‌దులుకోని టిడిపిని వీడి గులాబీ గూటికి వ‌చ్చిన నామాకు మ‌ద్ద‌తు ప‌లికి గెలిపించుకున్నారు.
ఖ‌మ్మం అసెంబ్లీ నుంచి గెలిచిన పువ్వాడకు మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అనంత‌రం పొంగుజ‌లేటి ప‌క్షాన ఉన్న కార్య‌క‌ర్త‌ల‌ను ఇబ్బందులు గురిచేయ‌డంతో సంక్షేమ ప‌థ‌కాలు అంద‌కుండా చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈక్ర‌మంలోనే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా బుజ్జ‌గిస్తూ వ‌చ్చారు. ఐదేళ్లు గ‌డిచినా త‌మ కార్య‌క‌ర్త‌ల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని బ‌లంగానే త‌న మాట వినిపించారు. పార్టీ పెద్ద‌ల నుంచి స్పంద‌న రాక‌పొగా ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన వేల కోట్ల బ‌కాయిల‌ను నిలిపివేశారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన తొలిరోజు ఖ‌మ్మం జిల్లా నుంచి ఒక్క‌రిని కూడా కారు పార్టీ అభ్య‌ర్ధుల‌ను అసెంబ్లీ గేటు తాక‌నివ్వ‌బోన‌ని శ‌ప‌థం చేశారు. ఖ‌మ్మం జిల్లాలో ఇచ్చిన మాట కోసం క‌ట్టుబ‌డి రాజ‌కీయ నాయ‌కుడిగా ప్ర‌జ‌ల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్నాడు. కార్య‌క‌ర్త క‌ష్టం వ‌చ్చింద‌ని కబురు తెలిస్తే అక్క‌డ వాలిపోతార‌నే పేరుంది. రాజ‌కీయాలకు అతీతంగా ఏ ఇంట్లో శుభ‌కార్యం జ‌రిగినా పొంగులేటి కానుకు ఉండాల్సిందే. జ‌నం ఇబ్బందుల్లో ఉన్నారంటే అక్క‌డ పొంగులేటి ఉంటార‌నే న‌మ్మకం ప్ర‌జ‌ల గుండెల్లో ఉంది.

పాలేరు నుంచి బ‌రిలోకి దిగ‌బోతున్న పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి త‌న రాజ‌కీయ వ్యూహాన్ని తెలంగాణ భ‌వన్‌కి తాకేలా అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో క్షేత్ర‌స్థాయిలో క్యాడర్ రంగంలోకి దిగారు. ప్ర‌స్తుత ఎమ్మెల్యే కందాళ ఉపేంద‌ర్‌రెడ్డికి డిపాజిట్ సైతం ద‌క్క‌కుండా చేసేలా ఎత్తులు వేస్తున్నారు. బ‌లంగా ఉన్న క‌మ్యూనిస్టులను పొంగులేటి క‌లుపుకోని పోవ‌డంతో త‌న ప‌వ‌ర్ కేసీఆర్‌కి చూపించేలా అడుగులు వేస్తున్నారు.

Related Posts

Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా ప్రగతి పథంపై డిప్యూటీ సీఎం భట్టి స్పెషల్ ఫోకస్

రాష్ట్రంలో ఖమ్మం జిల్లా(Khammam district)ను అగ్రగామిగా నిలిచేలా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే జిల్లాకు పలు అభివృద్ధి ప్రాజెక్టులను తీసుకొచ్చిన భట్టి ఇక వాటిని త్వరితగతిన…

Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం

ఏపీ(Andhra Pradesh)లో నామినేటెడ్ పదవుల(Nominated posts) కోలాహలం నెలకొంది. ఇటీవల వివిధ జిల్లాల్లోని 47 మార్కెట్ యార్డులకు ఛైర్మన్ల(Chairmans of Market Yards)ను నియమించి విషయం తెలిసింది. ఇందులో రిజర్వేషన్‌ కేటగిరీల(Reservation categories)ను పరిగణలోకి తీసుకుని, మహిళలకు కూడా ప్రాధాన్యమిస్తూ ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *