Corona Cases: మాస్కు పెట్టాల్సిందే..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

మన ఈనాడు:దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. తెలంగాణలో మొత్తం 9 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

Telangana Corona Cases: దేశంలో అంతరించి పోయిందని అనుకున్న కరోనా కొత్త అవతారంలో నేను ఇంకా ఉన్నాను అంటూ మళ్లీ వచ్చింది. దేశంలో కరోనా భారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే ఈ కరోనా కారణంగా కొత్తగా ఐదు మంది తమ ప్రాణాలను కోల్పోయారు. దేశంలో కర్ణాటక, కేరళ నుంచి ఎక్కువ కేసులు నమోదు అవుతున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ముఖ్యంగా శబరిమల కు వెళ్లి వస్తున్న ప్రజలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం కోరింది.

కలవరపెడుతున్న కొత్త వేరియంట్ JN-1
మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కరోనా కొత్త వేరియంట్ JN-1 దేశంలో వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 142 కరోనా కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌, కేరళలో కరోనా కేసులు పెరుగుతన్నాయి. యూపీ, కేరళలో కరోనాతో ఐదుగురు మృతి చెందినట్లు పేర్కొంది. తాజాగా కరోనాతో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందినట్లు ప్రకటించింది. రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ చేసింది. ఆర్టీపీసీఆర్‌ టెస్టులు పెంచాలని ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశం ఇచ్చింది. కాసేపట్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అధ్యక్షతన హైలెవెల్‌ మీటింగ్ జరగనుంది. మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేయనున్నారు.

Related Posts

Health Tips: ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? అయితే జాగ్రత్త!

ఎక్కువ కూర్చోవడం(Over Sitting) స్మోకింగ్(Smoking) చేసినంత ప్రమాదమని నిపుణులు చెప్తుంటారు. కానీ ప్రస్తుత జీవనశైలి కారణంగా అధికశాతం మంది రోజుకు 6గంటలకన్నా ఎక్కువ సేపే కూర్చొంటున్నారు. ఆఫీసు(Office)లోనే కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత కూడా TV చూస్తూ అని, ల్యాప్‌టాప్‌లో పని…

Summer: సమ్మర్ సీజన్.. వడదెబ్బతో జాగ్రత్త గురూ!

మార్చి ఆరంభంలోనే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. రోజురోజుకీ మండుతున్న ఎండల(to the sun)కు ప్రజలు బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. మార్చి మొదటి వారంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు(Record high temperatures) నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటితే చాలు భానుడు తన ప్రతాపాన్ని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *