
తెలంగాణం(Telangana) మణిహారమైన మన భాగ్యనగరం(Hyderabad) మరో అంతర్జాతీయ వేడుకకు సిద్ధమైంది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13, 14, 15వ తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్(Secunderabad Parade Grounds)లో నిర్వహించే 7వ అంతర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివల్ కోసం పర్యాటక, సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేసిది. ఈమేరకు ఆదివారం బేగంపేట్ హరిత ప్లాజా(Harita Plaza)లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్(International Kite and Sweet Festival) పోస్టర్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao) ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా..
‘‘తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్(Brand image of Hyderabad)ను పెంచేలా అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తాం. మూడ్రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 16 దేశాల నుంచి 47 మంది కైట్ ప్లేయర్స్, 14 రాష్ట్రాల నుంచి 60 మంది కైట్ క్లబ్ సభ్యులు పాల్గొని వివిధ డిజైన్ల పతంగులను ఎగురవేస్తారు. జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను, తెలంగాణ పిండి వంటలు(Telangana Pastries) స్టాళ్లలో ప్రదర్శిస్తారు’’ అని మంత్రి తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, వారసత్వ కట్టడాలు, ప్రాచీన దేవాలయాలను సందర్శించాలని కోరారు. దీనికి తెలంగాణ టూరిజం శాఖ(Telangana Tourism Department) తోడ్పాటునందిస్తుందని చెప్పారు.
Telangana Tourism is organizing the International Kite and Sweet Festival at Parade Ground, Secunderabad, from January 13th to 15th, 2025. Everyone is invited. pic.twitter.com/W13LxgilqM
— National Institute of Tourism & Hospitality Mngmnt (@NITHMofficial) January 12, 2025