TSRTC: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక నిర్ణయం..

మన ఈనాడు:  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పథకం మహిళలకు బస్సుల్లో  ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ పథకం ప్రారంభించారు. ‘మహాలక్ష్మి గ్యారెంటీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పించడం. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ పథకం అమల్లో ఉంది. ‘మహాలక్ష్మి గ్యారెంటీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్‎ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్ర స్థాయి అధికారులతో గురువారం సాయంత్రం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వర్చువల్‎గా సమావేశం నిర్వహించారు.

Share post:

లేటెస్ట్