అవనిపై తెలంగాణను అగ్రభాగాన నిలుపుతా: CM రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఏడాదిలో ప్రజా పాలన (Public Governance), ఏర్పాటు చేశామని తెలంగాణలో ని సమస్త ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా పోరాటు, ఉద్యమాలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఏడాది పాలనపై చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి డిసెంబర్ 7, 2023 నాడు తెలంగాణ నా చేతుల్లో పెట్టిందని తెలిపారు. తన వారసత్వాన్ని సగర్వంగా… సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను అప్పగించిందని ఆన ఎక్స్ లో పోస్టు చేశారు.

జన సేవకుడిగా.. ప్రజా సంక్షేమ శ్రామికుడిగా..

ఆక్షణం నుండి జన సేవకుడిగా.. ప్రజా సంక్షేమ శ్రామికుడిగా మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో.. సకల జనహితమే పరమావధిగా జాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా సహచరుల సహకారంతో… జనహితుల ప్రోత్సాహంతో విమర్శలను సహిస్తూ విద్వేషాలను ఎదురిస్తూ స్వేచ్ఛకు రెక్కలు తొడిగి.. ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచి…అవనిపై అగ్ర భాగాన తెలంగాణను (Telangana Government) నిలిపేందుకు గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ నాలుగు కోట్ల ఆశయాలను నడిపిస్తూ నిరంతరం జ్వలించే ఈ మట్టి చైతన్యమే స్ఫూర్తిగా… విరామం ఎరుగక విశ్రాంతి కోరక ముందుకు సాగిపోతున్నానని సీఎం ఏడాది సందర్భంగా ఏమోషనల్ ట్వీట్ చేశారు.

ఏడాదిలో విజయాలు చెప్పుకునేలా

కాగా తెలంగాణలో (Telangana Government) ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రస్తుతం ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తోంది. డిసెంబర్ 9 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఏర్పాటు కావడానికి కాంగ్రెస్ కారణమని ప్రజలకు వివరిస్తూ ఏడాది పాలనలో చేసిన రుణమాఫీ, మహాలక్ష్మీ పథకం, (Mahalakshmi Scheme,) ఆరోగ్య శ్రీ పథకంలో (Arogya Shri) రూ. 10 లక్షలకు పెంపు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇలా ప్రతి దాంట్లో విజయాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని నిర్ణయించారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *