Congress:తెలంగాణ ఎన్నికలకు వైఎస్సార్టీపీ దూరం: షర్మిల సంచలన ప్రకటన

ఈ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీకి దూరంగా ఉంటుందని షర్మిల(YS SHARMILA) తెలిపారు. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
కేసీఆర్ సర్కార్ పడిపోయే అంత ఛాన్స్ ఉందన్నారు. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను చీలిస్తే మళ్లీ కేసీఆర్(KCR) ముఖ్యమంత్రి అవుతారన్నారు. చీల్చొద్దని ఎంతో మంది మేధావులు, మీడియా అధిపతులు కూడా తమను కోరారన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ(YSRTP) పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్టీపీ కార్యకర్తలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని షర్మిల కోరారు. గెలుపు గొప్పది అని. . త్యాగం అంతకన్నా గొప్పదన్నారు. కాంగ్రెస్ గెలవడం ద్వారా కేసీఆర్ నియంత పాలన అంతం అవుతుందన్న ఆలోచనతోనే ఆ పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.

 

Share post:

Popular