మన ఈనాడు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దేశరాజకీయాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈక్రమంలో నవంబర్30తో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ఫోల్స్ ఫలితాలపై తెలంగాణ రాజకీయపార్టీలు టెన్షన్ మొదలైంది. ఓటర్లు నాడిపై THఫోల్స్ సర్వే సంస్థ నెలరోజులుగా తెలంగాణలోని 119నియోజకవర్గాల్లో ప్రజల నుంచి శాంపిల్స్ సేకరించింది. 7కేటగిరిలుగా విభజించి THఫోల్స్ సంస్థ సర్వే చేపట్టింది. దీంట్లో భారత రాష్ట్ర సమితి(BRS) సీఎం కేసీఆర్(KCR)పాలనపై ప్రజలు స్పష్టమైన వైఖరిని కుండబద్దలు కొట్టారు.
బీజేపి–బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న తెలంగాణ రాజకీయ పోరు గడిచిన కొద్దిరోజులుగా ఒక్కసారిగా మారిపోయింది. సీన్లోకి కాంగ్రెస్పార్టీ వచ్చి చేరడంతో రాజకీయాల్లో హీట్ పెంచింది. తెలంగాణ ముఖ్య నేతలు ‘హస్తం’ పక్షాన చేరడంతో విశ్లేషణలు మారుతూ వస్తున్నాయి. ఈక్రమంలోనే అసెంబ్లీ పోరుకు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రజల నాడి తెలుసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు ఆరాటపడ్డాయి.
అభివృద్దికే ప్రజలు ‘జై’ కొట్టారు:
10ఏండ్లుగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడుకుంటూ వందేళ్లలో చేయాల్సిన అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ ప్రచారస్ర్తంగా మార్చుకుంది. తెలంగాణ అభివృద్ధిని దేశం నలుమూలల చాటేలా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ సర్కారు హయంలోనే జరిగిందనే ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.
ఈక్రమంలో THఫోల్స్ అనే సర్వే సంస్థ నవంబరు 1 నుంచి నవంబరు 29వరకు సుమారు 3లక్షలకు పైగా ఓటర్ల నుంచి శాంపిల్స్ సేకరించారు.వీటిలో 18 నుంచి 80ఏళ్ల వయస్సు వారినే టార్గెట్ చేసుకుని సర్వే చేశారు. అంతేగాకుండా 2క్షల మంది నుంచి ఆన్లైన్ ద్వారా ప్రజల అభిప్రాయం తెలుసుకున్నారు. మరో లక్ష మందిని ప్రత్యక్షంగా సర్వే బృందం కలుసుకుని ఓటర్లు రాజకీయపార్టీల వైపు మొగ్గు చూపుతున్నారనే వివరాలు అడిగే ప్రయత్నం చేశారు.
7కేటగిరిలుగా ..శాంపిల్స్ సేకరణ:
ప్రధానంగా 18నుంచి 25ఏళ్ల వయస్సు కలిగిన 1.5లక్షల ఓటర్లు అభిప్రాయం సేకరించారు.
25నుంచి 35ఏళ్ల వయస్సు ఉన్న 50వేల ఓటర్లు నుంచి వివరాలు నమోదు చేశారు.
35నుంచి 55ఏళ్ల వయస్సు కలిగిన 30వేల ఓటర్లు అభిప్రాయం తెలుసుకున్నారు.
55ఏళ్ల పైబడిన వయస్సు కలిగిన 10వేల జనం నుంచి వివరాలు తెలుసుకున్నారు.
THఫోల్స్ ఎగ్జిట్ ఫలితాలు ఇలా:
BRS 59- 64
INC 48 – 54
BJP 05 – 08
MIM 06- 07
OHERS 00 –01