దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్​ న్యూస్​..హైదరాబాద్​లో మరో రైల్వే టెర్మినల్​ అందుబాటులోకి

 మన ఈనాడు:రైలు ప్రయాణికుల‌కు దక్షిణ మద్య రైల్వే గుడ్​ న్యూస్​ ప్రకటించింది. హైదరాబాద్​ కేంద్రంగా మ‌రో కొత్త రైల్వే టెర్మిన‌ల్ ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకరాబోతుంది. ఈ స్టేషన్ నుంచి సుమారుగా 25 రైళ్లు ప్రయాణించ‌నున్నాయి. మార్చి 2024 మొద‌టి వారం నుంచి ఈ ట్రైన్స్ అందుబాటులోకి రానునాన్నయి. ఈ టెర్మిన‌ల్‌ను మార్చి మొదటివారంలో ప్రధాన‌మంత్రి న‌రేంద్రమోడీ స్వయంగా ప్రారంభించ‌న‌నున్నారు. దీంతో హైదరాబాద్​ ప్రయాణికుల ట్రాఫిక్ స‌మ‌స్యలు తీర‌నున్నాయి.

ఈ కొత్త టెర్మిన‌ల్ హైద‌రాబాద్‌లోని చ‌ర్లప‌ల్లిలో కొత్తగా నిర్మించ‌నున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ప‌ది ప్లాట్‌ఫాములున్నాయి. ఇక్కడ ఇత‌ర రైళ్లు ఆగేందుకు ఖాళీ లేదు. వేల కిలోమీట‌ర్ల నుంచి వ‌చ్చిన ట్రైన్స్‌, ఎక్స్‌ప్రెస్‌లు గ్రేటర్​ శివార్లలో ఆపాల్సిన ప‌రిస్థితి దాపురించింది. కొత్తగా ప్రారంభ‌మ‌వుతున్న ఈ రైల్వే టెర్మిన‌ల్‌తో ప‌రిష్కారం ల‌భించ‌నుంద‌ని రైల్వే అధికారులు వివ‌రించారు. చర్లపల్లిలో నిర్మించిన ఈ కొత్త రైల్వే టెర్మిన‌ల్ నుంచి సుమారుగా 25 ట్రైన్స్ ప్రయాణించ‌నున్నాయ‌ని అధికారులు తెలిపారు. లింగంపల్లి నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఆగ‌కుండా డైరెక్టుగా సనత్‌నగర్‌ -మౌలాలి మీదుగా చర్లపల్లికి చేరుకుంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు. కొత్తగా నిర్మిత‌మ‌వుతున్న ఈ చర్లపల్లి స్టేషన్‌లో మెుత్తం ఆరు ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రానున్నాయ‌ని అధికారులు వివ‌రించారు. ఈ ఆరు ప్లాట్ ఫామ్‌ల‌లో రెండింటిని ఎంఎంటీఎస్‌లకు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ స్టేషన్‌కు ఎంఎంటీఎస్‌లు చేరుకునేలా ఏర్పాట్లు కూడా చేయ‌డం జ‌రిగింది.

న‌గ‌రంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు 5 కిలోమీటర్లు దూరంలోనే కొత్త రైల్వే టెర్మిన‌ల్ చర్లపల్లి స్టేషన్‌ ఉంది. న‌గ‌రంలోని ప్రయాణికులంతా ఇప్పడు ఎక్కువ‌శాతం ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా ప్రయాణాలు చేస్తున్నారు. సికింద్రాబాద్‌ – చర్లపల్లి మధ్య తిరిగే MMTS ట్రైన్లతో ప్రయాణికులు నగరానికి చేరుకునేలా చర్యలు తీసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ ప్రయాణికులు ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా వారి గ‌మ్యస్థానాల‌కు చేరుకునే వెసులుబాటును క‌ల్పించ‌నున్నారు. మౌలాలి నుంచి చర్లపల్లి వరకు మొత్తం నాలుగు రైల్వే లైన్లు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలపారు. వ‌చ్చే నెల మెుదటి వారంలో ప్రధానమంత్రి న‌రేంద్రమోదీ ఈ రైల్వే స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం జ‌రుగుతుంది.

 

Share post:

లేటెస్ట్