
తెలుగు సినిమాల్లో రాజుల కాలాన్ని ప్రతిబింబించే పౌరాణిక, చారిత్రక చిత్రాలు ప్రేక్షకులను తరచూ ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాంటి చిత్రాల్లో కొన్ని ప్రేక్షకుల మనసుల్ని గెలిస్తే , మరికొన్ని నిరాశను మిగిల్చిన సందర్భాలూ ఉన్నాయి. బాహుబలి, పొన్నియిన్ సెల్వన్, ‘మగధీర’ వంటి చిత్రాలు మాత్రం భారీ విజయాన్ని సాధించడమే కాదు, చారిత్రక పాత్రలకు కొత్త ఊపిరినిచ్చాయి. ఈ నేపథ్యంలో యువరాణుల పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.
కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) – ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రంలో కాజల్ అగర్వాల్ యువరాణి మిత్రవింద పాత్రలో కనిపించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఆమెకు తోడు వచ్చిన రాంచరణ్ నటనతో ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.
త్రిష కృష్ణన్(Trisha) – మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 1, 2 చిత్రాల్లో యువరాణి కుందవై పాత్రలో త్రిష కనిపించింది. శత్రువుల కుట్రలను పసిగట్టి, రాజకీయ నైపుణ్యంతో ముందడుగు వేసే పాత్రలో ఆమె అభినయం ప్రశంసలందుకుంది.
అనుష్క శెట్టి(Anushka Shetty) – ‘అరుంధతి’ చిత్రంలో అరుంధతి/జేజమ్మ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అదే తరహాలో ‘బాహుబలి’ సిరీస్‌లో దేవసేనగా, ‘రుద్రమదేవి’లో రుద్రమదేవిగా కత్తులు చేతబట్టి శత్రువులకు ధీటుగా ఎదురైన యువరాణిగా ఆకట్టుకుంది.
హన్సిక మోత్వాని(Hansika) – ‘పులి’ అనే తమిళ చిత్రంలో యువరాణి మంథాగినిగా నటించి అలరించింది. ఈ చిత్రంలో శ్రీదేవి కీలక పాత్రలో కనిపించగా, సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోయినా, హన్సిక పాత్ర ప్రేక్షకులను మెప్పించింది.
ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) – ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో మందాకినీ దేవిగా అలరించారు. ఆమె పాత్ర సినిమాకు ఓ మిస్టిక్ ఆకర్షణను తీసుకువచ్చింది.