మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohan Lal) హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) తెరకెక్కించిన తాజా చిత్రం ‘L2: Empuran’. గతంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘లూసిఫర్(Lucifer)’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తోంది. ఈ నెల 27న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో మేకర్స్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, నిర్మాత దిల్‌రాజు(Dil Raju) తదితరులు పాల్గొన్నారు.

ఇప్పుడు తమ సినిమా డైరెక్ట్‌గా తెలుగులోనే..
ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమ(Telugu film industry)ను దేశంలోనే ది బెస్ట్ ఇండస్ట్రీ(The Best Industry) అని కొనియాడారు. తెలుగు ప్రేక్షకులు నటీనటులను గౌరవించే విధానం తనను ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. తన 47 ఏళ్ల కెరీర్లో అనేకమంది తెలుగు నటులతో కలిసి పని చేసే అవకాశం లభించిందని, అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao)తో కలిసి నటించడం తన అదృష్టమన్నారు. గతంలో తన మలయాళ చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయని, ఇప్పుడు తమ సినిమా డైరెక్ట్‌గా తెలుగులోనే విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. కాగా, ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్(Sri Venkateswara Creations Banner) పై నిర్మాత దిల్‌రాజు(Dil Raju) విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

ట్రైలర్ అలా చూస్తూనే ఉండిపోయా: దిల్ రాజు
దిల్ రాజు మాట్లాడుతూ… “లూసిఫర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మాలీవుడ్(Mollywood)లో అత్యధిక బడ్జెట్‌తో తీసిన ఈ సీక్వెల్ ఏ రేంజ్లో ఉందో టీజర్(Teaser), ట్రైలర్(Trailer) చూస్తేనే అర్థం అవుతోంది. ట్రైలర్ అలా చూస్తూనే ఉండిపోయా. ఎంతో గ్రాండియర్‌గా అనిపించింది. స్క్రీన్ మీద మోహన్ లాల్ కనిపిస్తే వావ్ అనిపిస్తుంది” అని అన్నారు.






