Varun Snadesh| డైరక్టర్​ రాజేష్​ కోసం‘నింద’మూవీలో కష్టపడ్డా

వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’ అనే చిత్రాన్ని ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తోంది.

రొటీన్ సినిమాలు చేస్తూ ఉండటంతో నాకే బోరింగ్‌గా అనిపించింది. ఇలాంటి సినిమాలే చేస్తున్నానని అనుకునే సందర్భాలు వచ్చాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని యూఎస్ వెళ్లా. ఆ టైంలోనే రాజేష్ ఈ నింద కథను చెప్పారు.

నిందలో నా పాత్రకి, నిజ జీవితంలోని నా పాత్రకి అస్సలు పోలిక ఉండదు. నేను బయట జాలీగా, చిల్‌గా ఉంటాను. నేను ఎప్పుడూ కూడా సీరియస్‌గా ఉండను. కానీ ఈ చిత్రంలో నా వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి పూర్తిగా భిన్నమైన పాత్రను పోషించాను. ఈ చిత్రంలో ఎంతో సెటిల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా కనిపిస్తాను.

సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లలో ఎన్నో సినిమాలు వచ్చాయి. నింద విషయంలో మాత్రం స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉండబోతోంది. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు, ఊహించలేరు. అసలు పూర్తి కథను, స్క్రిప్ట్‌ని ఆర్టిస్టులెవ్వరికీ నెరేట్ చేయలేదు. దీంతో నటించే ఆర్టిస్టుల్లోనూ ఓ క్యూరియాసిటీ పెరిగింది. అసలు నేరస్థుడు ఎవరు? అనే విషయం తెలియకపోవడంతో సహజంగా నటించారు. కథ చెప్పినప్పుడు నేను గెస్ చేసేందుకు ప్రయత్నించాను. కానీ నేను కూడా చెప్పలేకపోయాను.

కానిస్టేబుల్ అనే సినిమా షూటింగ్‌లో నా కాలికి గాయమైంది. ఆ వెంటనే నింద షెడ్యూల్ ఉంది. అప్పటికే ఆర్టిస్టులంతా రెడీగా ఉన్నారు. అంతా సెట్ అయి ఉంది. నా ఒక్కడి కోసం షూటింగ్ క్యాన్సిల్ చేయడం ఇష్టం లేక.. రాజేష్ డెడికేషన్, ఫ్యాషన్ చూసి.. ఆ గాయంతోనే షూటింగ్ చేశాను. రాజేష్ కోసమే ఆ రిస్క్ తీసుకున్నాను.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *