Special Train : ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక రైలు

Mana Enadu:అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్టణంకు ఆదివారం ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి రాత్రి 7.45 గంటలకు బయల్దేరి (రైలు నెం. 07097) మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖ పట్టణం చేరుకుంటుంది.

AP Election 2024 Special Train : ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు 13న పోలింగ్ జరగనుంది. దీంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. హైదరాబాద్ లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. బస్సులు, ట్రైన్స్ దొరక్క ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి బస్టాప్ లు, రైల్వే స్టేషన్లతో పాటు హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల భారీ రద్దీ కనిపించింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సోమవారం రాత్రి 7.50 గంటలకు విశాఖపట్టణం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి (రైలు నెం. 07098) మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 8.15 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అదేవిధంగా ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు అదనంగా ఒక్కో బోగీని జత చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

Related Posts

Bhairavam OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘భైరవం’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

తెలుగు సినీ ప్రియులకు శుభవార్త. బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohith) ప్రధాన పాత్రల్లో నటించిన హై-ఓక్టేన్ యాక్షన్ డ్రామా ‘భైరవం(Bhairavam)’ ఓటీటీలోకి రాబోతోంది. ఈ చిత్రం జులై 18 నుంచి ZEE5…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *