Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్..ఎక్కడనుంచైనా జనరల్ టికెట్

Mana Enadu: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌ న్యూస్ చెప్పింది. రైల్వేకు చెందిన యాప్‌ను కొత్త ఫీచర్లతో అప్‌డేట్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం ఇప్పుడు ఎక్కడ నుంచి అయినా జనరల్ టికెట్ తీసుకోవచ్చని తెలిపింది.

జనరల్ టికెట్ బుకింగ్ కోసం ఇక మీదట లైన్లలో నిలబడి కష్టాలు పడక్కర్లేదు. దీనికి కోసం రైల్వేశాఖ ఇంతకు ముందే యూటీఎస్ యాప్‌ను తీసుకువచ్చింది. అయితే ఇందులో ఇప్పటివరకు స్టేషన్‌కు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే జనరల్ టికెట్ తీసుకునే అవకాశం ఉండేది. దీంతో ఈ యాప్ వల్ల పెద్ద ఉపయోగం లేకుండా అయిపోయింది. అందుకే దీన్ని అప్‌డేట్ చేసింది రైల్వేశాఖ. దాని ప్రకారం రైలు ఎంత దూరంలో ఉన్నా టికెట్ పొందేలా యాప్‌ను అప్‌డేట్ చేశారు. దీనివలన ఇప్పుడు ఇంట్లో ఉండగానే ఎంత దూరం నుంచి అయినా టికెట్‌ను బుక్ చేసుకోవచ్చును. అయితే ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోవాలి.

ముఖ్యంగా పేద, మధ్యతరగతి వారు రైలు ప్రయాణాలనే కావాలనుకుంటారు. అయితే ట్రైన్ బుక్ టికెట్లు తీసుకోవడం ఈ మధ్య కాలంలో చాలా ఈజీ అయిపోయింది. రైల్వే యాప్‌లోనే ఈజీగా టికెట్ బుక్ సేసుకోవచ్చును. అయితే ఇది కేవలం రిజర్వేషన్ చేసుకునేవారికి మాత్రమే అందుబాటులో ఉంది. అదే జనరల్‌లో ప్రయాణించాలి అంటే స్టేషన్‌కు వెళ్ళి టికెట్ తీసుకోవాల్సిందే. యాప్‌లో కూడా జనరల్ టికెట్ తీసుకోవచ్చు కానీ..కేవలం రెండు స్టేషన్ల దూరం నుంచి మాత్రమే ఇది సాధ్యమయ్యేది. ఇప్పుడు దీనికి సంబంధించి కొత్త అప్‌ డేట్ చేసింది రైల్వేశాఖ.

Related Posts

Vishwambhara: వింటేజ్ లుక్‌లో మెగాస్టార్.. ‘విశ్వంభర’ నుంచి ఫొటో రివీల్!

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi).. ఆరుపదుల వయసులోనూ కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా అదే ఉత్సాహంతో నటిస్తున్నారు. వరుసబెట్టి మరీ సినిమాలు చేసేస్తున్నారు. అటు ఆయన వేసే స్టెప్పులకూ తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయన బింబిసార ఫేమ్…

తొలి ఐమాక్స్ మూవీగా మోహన్‌లాల్ L2: Empuraan

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్(Mohan Lal), పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కాంబోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన మూవీ ‘ఎల్2ఇ ఎంపురాన్ L2: Empuraan’. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఈనెల 27న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *