Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Mana Enadu:నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి మసునూరు టోల్ ప్లాజా దగ్గర లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి మసునూరు టోల్ ప్లాజా(Kavali Tollflaza) దగ్గర లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీని క్రాస్ చేయబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు ఢీకొట్టంతో ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అయితే.. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చెన్నై నుంచి తిరిగి కొయ్యలగూడెంకు వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. మృతులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన జ్యోతి కల్యాణి, రాజీ, కుమార్‌గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share post:

లేటెస్ట్