ManaEnadu:రేషన్ కార్డుదారులకు సర్కార్ తీపి కబురు అందించింది. రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు వచ్చేనెల నుంచి సబ్సిడీపై చక్కెర, కందిపప్పును కూడా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఇక నుంచి రాయితీపై రూ.67కే కిలో కందిపప్పు అందించనుంది.
Ration Card: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి రేషన్ కార్డు లబ్దిదారులకు ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీపై చక్కెర, కందిపప్పును కూడా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. బయట మార్కెట్ లో నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఆగస్టు నుంచి అక్టోబరు వరకు 3 నెలలకు సరిపోయేలా కందిపప్పు, పంచదార, గోధుమపిండి సరఫరా కోసం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ల నుంచి ఇప్పటికే టెండర్లకు ఆహ్వానించింది. మూడు నేలలకు సరిపోయే విధంగా 22,500 టన్నుల కందిపప్పు, 17,538 టన్నుల పంచదార సేకరణ కోసం టెండర్లకు పిలిచింది. వచ్చేనెల నుంచి రేషన్ కార్డు ఉన్నవారికి రాయితీపై రూ.67కే కిలో కందిపప్పు అందించనుంది బాబు సర్కార్. అలాగే అరకిలో చొప్పున చక్కెరను కూడా పంపిణీ చేయనుంది.