Mana Enadu: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో ఫేమ్ ఉన్న యాక్టర్. సినిమా ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా అందులో చక్కగా ఒదిగిపోతాడు. వారసత్వంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన కష్టంతో ఓ స్టార్‌గా ఎదిగాడు. నటన, డాన్స్, యాక్షన్ ఇలా ఏ కేటగిరీ అయినా.. నవరసాలు పండించడం తారక్‌కు వెన్నెతో పెట్టిన విద్య.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం వరుస మూవీలతో బిజీబిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్‌లో ‘దేవర’ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా క్లైమాక్స్‌కు చేరకుంది. మరోవైపు దీనిని రెండు పార్టులుగా తీస్తానని ఇప్పటికే ప్రకటించేశాడు డైరెక్టర్ కొరటాల. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్‌లో నటిస్తున్నాడు. దీంతోపాటు హిందీలో ‘వార్ 2’ సినిమాను కూడా మొదలుపెట్టాడు తారక్. ఈ హిందీ చిత్రంలో హృతిక్ రోషన్ నటిస్తున్నాడు. ఈ మూవీ భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. ‘వార్ 2’ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమాలో నటించనున్నాడు.
తాజాగా మరో భారీ మూవీకి ఈ నందమూరి వారసుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత ఏడాది చివర్లో వచ్చిన ‘హాయ్ నాన్న’ సినిమా డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేయనున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఇప్పటికే డైరెక్టర్ ఎన్టీఆర్‌కు స్టోరీని కూడా వినిపించాడట. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా తొలి భాగం 2026లో మొదలై.. 2028లో విడుదల కానుంది. రెండో భాగం 2030లో విడుదలకు డైరెక్టర్ ప్లాన్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. తాజాగా దర్శకుడు శౌర్యువ్ ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్‌తో తాను సినిమా తీయనున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పేశాడు డైరెక్టర్ శౌర్యువ్.