Getup Srinu : రాజు యాదవ్​ నవ్విస్తూ..ఏడిపిస్తాడు!

Mana Enadu: రాజు యాదవ్ సినిమా మే 17న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.  ఈవెంట్లో మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో రాజు యాదవ్ సినిమా షూటింగ్ లో గెటప్ శ్రీను ఎదుర్కున్న కష్టాల గురించి తెలిపాడు.

Raju Yadav:రాజు యాదవ్ మాట్లాడుతూ.. షూటింగ్ షెడ్యూల్ లో ఒక రోజు ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు షూట్ చేశాము. మామూలుగానే సినిమా అంతా నవ్వుతూనే పెట్టాలి ఫేస్. ఆ రోజంతా అలాగే పెట్టాను. చివర్లో ఎమోషన్ సీన్ చేయాలి. ఓ పక్క స్మైల్ ఫేస్ పెట్టాలి, మరో పక్క ఎమోషన్ చూపెట్టాలి. అది సరిగ్గా రావట్లేదు. నాకు తెలియకుండా ఏడుపు వచ్చేసింది, నా వల్ల కావట్లేదు అనిపించింది. కానీ డైరెక్టర్ సపోర్ట్ ఇచ్చి చేయించారు. నవ్వుతూ ఎక్కువ సేపు ఉంచితే దవడ దగ్గర ఎముకలు బాగా స్ట్రెస్ తీసుకొని వణుకు వచ్చేది. దాని వల్ల దవడల దగ్గర, మెడ దగ్గర బాగా నొప్పి వచ్చేది. ఆ నొప్పుల వల్ల కళ్ళల్లో ఎక్స్‌ప్రెషన్స్ మారిపోయేవి. ఆ నొప్పిని భరిస్తూ, కావాల్సిన ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాను ఛాలెంజింగ్ గా తీసుకొని. ఆ రోజు మాత్రం నేను భయపడ్డాను ఆర్టిస్ట్ గా ఫెయిల్ అయిపోతానేమో అని అన్నారు.

Share post:

లేటెస్ట్