విశాల్ Vs లైకా ప్రొడ‌క్ష‌న్స్‌.. హీరోపై మద్రాస్ హైకోర్టు ఫైర్.. ఇంతకీ ఈ వ్యవహారం ఏంటి?

Mana Enadu:తమిళ సినిమా హీరో విశాల్ గురించి తెలియనివారుండరు. తెలుగు వాళ్లకు కూడా పరిచయమే. చెప్పాలంటే అసలైన తెలుగువాడు. కానీ చెన్నైలో సెటిల్డ్. అయితే విశాల్ మనసు మంచిదే అయినా తరచూ వివాదాల్లో ఇరుక్కుంటాడు. చాలా రోజుల నుంచి లైకా ప్రొడక్షన్స్ తో ఓ కేసులో విశాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఈ కేసు వ్యవహారంలై మద్రాస్ హైకోర్టు ఈ యంగ్ హీరోపై బాగా సీరియస్ అయింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా పెట్టిన కేసు విచారణలో విశాల్‌ తీరుపై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వాదనను వినిపించేందుకు గురువారం రోజున విశాల్ కోర్టుకు వెళ్లాడు.  ఇందులోభాగంగా లైకాతో జరిగిన ఒప్పందం గురించి జడ్జి ప్రశ్నించగా.. అది తన దృష్టికి రాలేదని చెప్పాడు. అంతే కాదు.. తాను కేవలం ఒక ఖాళీ కాగితంపై సంతకం చేశానని బదులిచ్చాడు. ఇది విన్న జడ్జికి చాలా కోపం వచ్చింది.  ‘‘ అసలు ఖాళీ పేపర్‌పై మీరెలా సంతకం చేశారు? తెలివిగా సమాధానం చెబుతున్నాననుకుంటున్నారా? ఇదేం సినిమా షూటింగ్‌ కాదు.. కాస్త జాగ్రత్తగా బదులివ్వండి’’  అంటూ విశాల్ కు కాస్త గట్టిగానే చురకలంటించింది.

ఇంతకీ ఈ కేసు ఏంటి..

విశాల్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్‌కు మధ్య కొన్నాళ్లకిత్రం డబ్బు విషయంలో విభేదాలు తలెత్తాయి. సినిమా తీస్తాన‌ని తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నాడని, ఆ డ‌బ్బు తిరిగి ఇవ్వలేదని 2022లో లైకా ప్రొడ‌క్ష‌న్స్ మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించింది. అయితే తొలిసారి జరిగిన వాదనల అనంతరం లైకా ప్రొడక్షన్స్‌కు విశాల్‌ రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయాలని, తన ఆస్తి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అప్పటివరకూ ఆయన నటించిన, నిర్మించిన సినిమాలేవీ థియేటర్లలో గానీ, ఓటీటీల్లో గానీ విడుదల చేయకూడదంటూ స్టే కూడా విధించింది.

అయితే, కోర్టు తీర్పును విశాల్ ఉల్లంఘించి పలు సినిమాల్లో నటించాడు. ఆ చిత్రాలు రిలీజ్ కూడా అయ్యాయి. ఇదే విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. త‌మ‌కు డిపాజిట్ రూపంలో చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించ‌కుండానే ఆయ‌న న‌టించి, నిర్మించిన ప‌లు సినిమాల‌ని విడుద‌ల చేశార‌ని విశాల్‌పై ఈ ఏడాది జూన్‌ నెలలో కోర్టు ధిక్క‌ర‌ణ కేసు ఫైల్ చేసింది. అయితే ఆ సమయంలో కోర్టుకు సంబంధిత ఆధారాలను చూపించలేకపోవడంతో విచారణ పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది.

ఇక తాజాగా మరోసారి ఈ వ్యవహారంపై గురువారం రోజున విచారణ జరిగింది. ఈ క్రమంలోనే ‘‘పందెంకోడి 2’ విడుదలకు ముందే డబ్బు తిరిగి ఇచ్చేస్తానని మాటిచ్చారా?’’ అని కోర్టుకు వచ్చిన విశాల్ ను ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు ఆయన ఆసక్తి చూపించలేదు. ‘‘ఇలా ప్రవర్తిస్తే కుదరదు. అవును, లేదా కాదు అని సమాధానం చెప్పండి’’ అని మరోసారి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన తాను లైకా దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నట్లు అంగీకరించారు. 

 

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *