Manamey| ప్రేక్షకులకు మరో ప్రపంచాన్ని పరిచయం చేసే కథ

Mana Enadu: శర్వానంద్‌ (Sharwanand), కృతిశెట్టి (Krithi Shetty) జంటగా నటించిన చిత్రం ‘మనమే’ (Manamey). ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు.

శుక్రవారం ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో బుధవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. దర్శకులు మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేశ్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై, చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు (Manamey Movie Pre Release Event).

నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ శర్వానంద్‌కు బిరుదు ఇచ్చారు. అదే చామింగ్‌ స్టార్‌. ఈ మేరకు రూపొందించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. వేడుకను ఉద్దేశించి శర్వానంద్‌ మాట్లాడుతూ.. జూన్‌ 7న మన సినిమా రూపంలో మరో పండగ వస్తుంది. దాని తర్వాత 27న ‘కల్కి 2898 ఏడీ’ పండగ. ఇకపై అన్నీ మంచి రోజులే. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనం ఉన్న సినిమాలే ఇవ్వాలని కోరుకుంటా. సమయం ఎంత విలువైందో ఈ సినిమాలో చూపించాం. అలా అని సందేశం ఇచ్చే ప్రయత్నం చేయలేదు.

ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. చివరి 40 నిమిషాల చిత్రం మిమ్మల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్తుంది. ఈ మూవీ తప్పక బ్లాక్‌బస్టర్‌ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ ప్రాజెక్టును నేనెంతగానో ప్రేమించా. శ్రీరామ్‌ ఆదిత్య ప్రతిభావంతుడు. ఈ ఈవెంట్‌ను పిఠాపురంలో నిర్వహించాలనుకున్నాం. కానీ, అనుమతి లభించలేదు. సక్సెస్‌ పార్టీ అక్కడే ఉండొచ్చు అని అన్నారు.

ఈ సినిమాకి కుటుంబ ప్రేక్షకులే కాదు యూత్‌ కూడా కనెక్ట్‌ అవుతారు. శర్వానంద్‌ అలవోకగా నటిస్తారు. ఆయనతో కలిసి నటించడం మంచి అనుభూతి. దర్శకుడు కథ చెప్పినప్పుడు ఎలా ఫీలయ్యానో అవుట్‌పుట్‌ చూశాక అదే ఫీలయ్యా. ఆయన మ్యాజిక్‌ చేశారు. రెండేళ్లకే విక్రమ్‌ ఆదిత్య (డైరెక్టర్‌ తనయుడు)అదరగొట్టాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో అతడి యాక్టింగ్‌ చూసి భావోద్వేగానికి గురయ్యా” అని కృతిశెట్టి అన్నారు.

Related Posts

అనంతపురంలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ పార్టీ.. ఎప్పుడంటే?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా…

తాగిన మత్తులో ‘జైలర్’ విలన్ వీరంగం.. వీడియో వైరల్

‘జైలర్ (Jailer Movie)’ సినిమాలో ‘వర్త్ వర్మా వర్త్’.. అనే డైలాగ్ తో బాగా పాపులర్ అయిన విలన్ వినాయకన్ (Vinayakan). ఈ మలయాళ నటుడు తన విలన్ రోల్స్ తోనే కాదు.. రియల్ లైఫ్ లో పలు వివాదాలతో తరచూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *