Dirty Fellow|ఈ నెల 24న డర్టీ ఫెలో..కుటుంబ కథా చిత్రం

Mana Enadu: ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా నటిస్తున్న సినిమా ‘డర్టీ ఫెలో’. ఈ చిత్రంలో దీపిక సింగ్, సిమ్రితీ బతీజా, నిక్కిషా రంగ్ వాలా హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ‘డర్టీ ఫెలో’(Dirty Fellow Movie) చిత్రాన్ని గుడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై జి శాంతి బాబు నిర్మిస్తున్నారు. ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, హీరో సంపూర్ణేష్ బాబు గెస్ట్ లుగా పాల్గొన్నారు.

దర్శకుడు ఆడారి మూర్తి సాయి మాట్లాడుతూ..  ఒకప్పుడు మన సినిమాలకు శతదినోత్సవాలు జరుపుకునేవాళ్లం. ఇప్పుడు రెండు రోజులకే సినిమా లైఫ్ ఫినిష్ అవుతూ జత దినోత్సవాలు జరుపుకునే పరిస్థితి వచ్చింది. టీవీ వచ్చాక సినిమా పనైపోయిందన్నారు. ఇంట్లో పూజగది ఉంటే దేవాలయం కాదు. సినిమాను థియేటర్ లోనే చూడండి. చిన్న సినిమాలను బతికించండి. 

దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ – శాంతి చంద్ర గారు ఎక్స్ సర్వీస్ మెన్. దేశానికి తన సేవలు అందించాడు. డర్టీ ఫెలో సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. డైరెక్టర్ మూర్తి సాయి మిగత మూవీ టీమ్ సినిమాను జాగ్రత్తగా చూసుకుంటూ రూపొందించారు.డైరెక్టర్స్ డే ఈవెంట్ కోసం మూడు రోజులుగా నిద్రలేదు. వీళ్లు నాకు చాలా కావాల్సిన వాళ్లు అందుకే ఈ ఈవెంట్ కు వచ్చాను. మాస్ అంశాలతో యాక్షన్ ఎంటర్ టైనర్ గా డర్టీ ఫెలో ఆకట్టుకుంటుంది. 

డర్టీ ఫెలో సినిమాను ఈ నెల 24న థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. శాంతి చంద్ర గారు ఇండియన్ నేవీలో తన అనుభవాలు, వాళ్లు చేసిన సాహసాలు చెబుతుంటే ఒళ్లు గగుర్పొడిచేది. ఆ నేపథ్యంతో సెయిలర్ అనే పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారు శాంతి చంద్ర. ఆ సినిమాతో ఇండియా మొత్తంలో ఆయన గుర్తింపు తెచ్చుకుంటారన్నారు.

హీరో శాంతి చంద్ర మాట్లాడుతూ – ఈ సినిమా మేకింగ్ లో గైడ్ చేస్తూ మమ్మల్ని నడిపించిన డైరెక్టర్ వీరశంకర్ గారికి థాంక్స్ నా గురించి చెప్పుకోవాలంటే సినిమానే నా జీవితం. సినిమానే నా ఆలోచన. నా నాలుగో ఏటనే మా నాన్న చనిపోయారు. చిన్నప్పటి నుంచి నేను ఏం చేసినా కెమెరా నన్ను ఫాలో అవుతుందనే ఫీల్ అయ్యేవాడిని. ఇండియన్ నేవీలో చేరాక అక్కడ మేము చేసే సాహసాల టైమ్ లోనూ కెమెరా ఉందనే అనిపించేది.

నటి నటులు:
శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ వాలా హిరో హీరోయిన్లుగా నటించగా సత్యప్రకాస్, నాగి నిడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులు ఉన్నారు.

Share post:

లేటెస్ట్