Mana Enadu:టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్ (Double Ismart). డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఈనెల15వ (August)తేదీన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవనుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, గ్లింప్స్, మ్యూజికల్ ప్రోమోస్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్(trailer)ను విడుదల చేశారు.

రామ్ ఎనర్జీ వేరే లెవెల్..
2 నిమిషాల 43 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఊర మాస్ అని చెప్పాలి. పూరీ జగన్నాథ్ సిసలైన ట్రీట్‌ను అందించబోతున్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. సంజయ్ దత్(sanjaydatt), కావ్యా థాపర్(kavya thapar),అలీ(ali)ల పర్ఫార్మెన్స్ సూపర్‌గా ఆకట్టుకుంటుంది. రామ్ ఎనర్జిటిక్ డైలాగ్ డెలవరీ గురించి ఇక చెప్పనవసరం లేదు. టైటిల్ తగ్గట్లే రామ్ స్పీడ్ కూడా పీక్స్‌లో ఉంది. ఇక మెలోడి బ్రహ్మ మణిశర్మ ట్రైలర్‌లోని సన్నివేశాలను హైలైట్ చేయడంలో కీ రోల్ పోషించాడు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌పై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ డైలాగ్స్ హైలైట్..
‘‘గుంజి కొడితే గుడ్డు గులాబ్ జామ్ అయితది’’డైలాగ్‌తో పాటు సంజయ్ దత్‌కు వార్నింగ్ ఇచ్చే క్రమంలో ‘‘కర్మకాండ చేస్తా నా కొడకా’’వంటి డైలాగ్స్ రామ్ మేనరిజాన్ని హైలైట్ చేసి చూపించాడు డైరెక్టర్ పూరీ. చివరలో శివలింగం ముందు చేసిన ఫైటింగ్ సీన్ హైలైట్ గా కనపడుతోంది.ఇంకేందుకు ఆలస్యం మీరూ డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్‌ను చూసేయండి…






