Mana Enadu:69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ -2024 ఈవెంట్ హైదరాబాద్‌లో శనివారం రాత్రి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్, మాలీవుడ్‌కు చెందిన నటీనటులు హాజరయ్యారు. రెడ్ కార్పెట్‌పై ఈ నటులు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు ఈ ఈవెంట్లో పలువురు నటులు తమ డ్యాన్స్ పర్ఫామెన్స్తో అలరించారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ ఈ ఈవెంట్‌కు యాంకర్లుగా వ్యవహరించారు. ఇక రావిషింగ్ బ్యూటీ రాశీఖన్నా, నేచరుల్ బ్యూటీ అపర్ణ బాలకమురళీ, సానియా ఇయాపాన్, గాయత్రీ భరద్వాజ్ తమ పర్ఫామెన్స్తో ఉర్రూతలూగించారు.
ఈ ఏడాది ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో చిన్న సినిమాగా రిలీజ్ అయి ఇప్పటికే పలు అంతర్జాతీయ పురస్కారాలు సొంతం చేసుకున్న బలగం ఉత్తమ చిత్రంగా నిలిచింది. అంతే కాదండోయ్ బెస్ట్ డైరెక్టర్‌గా ఈ సినిమా దర్శకుడు వేణుకు ఫిల్మ్ ఫేర్ దక్కింది. ఇక నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేశ్‌లు దసరా చిత్రానికి గానూ బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. నాని నటించిన దసరా, హాయ్ నాన్న చిత్రాల దర్శకులు శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న) బెస్ట్ డెబ్యూ డైరెక్టర్లుగా అవార్డు అందుకున్నారు. ఇక చిన్న సినిమాగా రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసిన బేబీ చిత్రానికి కూడా పలు విభాగాల్లో అవార్డులు వచ్చాయి.
69 శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 (తెలుగు) విన్నర్స్..
బెస్ట్ చిత్రం: బలగం
బెస్ట్ యాక్టర్: నాని (దసరా)
బెస్ట్ నటి: కీర్తి సురేష్ (దసరా)
బెస్ట్ దర్శకుడు: వేణు యెల్దండి (బలగం)
బెస్ట్ పరిచయ దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్‌నాన్న)
బెస్ట్ చిత్రం (క్రిటిక్స్): సాయి రాజేష్ (బేబీ)
బెస్ట్ నటి (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య (బేబీ)
బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్): నవీన్ పొలిశెట్టి (మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి), ప్రకాశ్‌రాజ్ (రంగమార్తాండ)
బెస్ట్ సహాయ యాక్టర్: రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)
బెస్ట్ సహాయ నటి: రూప లక్ష్మీ (బలగం)
బెస్ట్ గాయకుడు: శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
బెస్ట్ గాయని: శ్వేత మోహన్ (మాస్టారు.. మాస్టారు.. సార్)
బెస్ట్ గేయ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
బెస్ట్ సంగీతం: విజయ్ బుల్గానిన్ (బేబీ)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూరన్ (దసరా)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: కొల్లా అవినాష్ (దసరా)
బెస్ట్ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధామ్ దోస్తానా.. దసరా)
69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 (తమిళం) విన్నర్స్..
బెస్ట్ చిత్రం: చిత్త (తెలుగులో చిన్నా)
బెస్ట్ యాక్టర్: విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్2)
బెస్ట్ నటి: నిమేషా సజయన్ (చిత్త)
బెస్ట్ దర్శకుడు: ఎస్‌యూ అరుణ్ కుమార్ (చిత్త)
బెస్ట్ చిత్రం (క్రిటిక్స్): వెట్రిమారన్ (విడుదలై పార్ట్-1)
బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్): సిద్ధార్థ్ (చిత్త)
బెస్ట్ నటి (క్రిటిక్స్): ఐశ్వర్య రాజేశ్ (ఫర్హానా), అపర్ణ దాస్ (దాదా)
బెస్ట్ సహాయ యాక్టర్: ఫహద్ ఫాజిల్ (మామన్నన్)
బెస్ట్ సహాయ నటి: అంజలి నాయర్ (చిత్త)
బెస్ట్ గాయకుడు: హరిచరణ్ (పొన్నియిన్ సెల్వన్2)
బెస్ట్ గాయని: కార్తికా వైద్యనాథన్ (చిత్త)
బెస్ట్ గేయ సాహిత్యం: ఇలంగో కృష్ణన్ (అగ నగ.. పొన్నియిన్ సెల్వన్2)
బెస్ట్ సంగీతం: దిబు నినాన్ థామస్, సంతోష్ నారాయణన్ (చిత్త)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్2)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: తోట తరణి (పొన్నియిస్ సెల్వన్2)