Mana Enadu: రాజ్‌తరుణ్ హీరోగా నటించిన సినిమా ‘తిరగబడరా సామి’. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా లు కథనాయికలు. సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్, రఘు బాబు కీలక పాత్రలు పోషించారు. జెబి సంగీతం అందించిన ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

వైవిధ్యభరిమైన కథలో ఆద్యంతం వినోదాత్మకంగా ఈ మూవీని తీర్చిదిద్దినట్లుగా అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూరైంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి అందరం ప్రాణం పెట్టి చేశాం. మా అందరికి కంటే ఎక్కువ కష్టపడింది డీవోపీ జవహర్ రెడ్డి గారు. ఆయన లేకపోతే సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది కాదు. ఈ సినిమాలో నన్ను పార్ట్ చేసిన నిర్మాత శివ గారికి థాంక్ యూ. జెబి గారు గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు. మాల్వి వన్ అఫ్ ది బెస్ట్ యాక్టర్. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరున థాంక్ యూ. డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఆయన నాపై ఒక్కసారి కూడా కొప్పడలేదు.
మాల్వి మల్హోత్రా మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఇది చాలా బ్యూటీఫుల్ కథ. ఇందులో చాలా మంచి పాత్ర చేశాను. ఇందులో బాలకృష్ణ ఫ్యాన్ గా కనిపిస్తా. నాకు యాక్షన్ సీన్ కూడా వుంది. ఈ సినిమాతో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా వుంది. రాజ్ తరుణ్ గారితో కలసి పని చేయడం చాలా అనందంగా వుంది. తను అద్భుతమైన యాక్టర్. అందరూ థియేటర్స్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి’ అన్నారు.
నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరు ధన్యవాదాలు. ఎ ఎస్ రవికుమార్ చౌదరి గారు కథ చెప్పిన వెంటనే చాలా నచ్చింది. రాజ్ తరుణ్ అయితే బావుటుందని వారు ఒప్పుకోగానే సినిమాని స్టార్ట్ చేశాం, జెబి అద్భుతంగా నేపధ్య సంగీతం చేశారు. జవహర్ రెడ్డి గారు చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. నేను ప్రతి సినిమాలో కొత్తవారిని పరిచయం చేస్తుంటాను.
తారాగణం: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి






