Krishna From Brindavanam : గోవాలో మ్యూజిక్​..ఆ సినిమా హీరో క్రేజీ

Mana Enadu: విలేజ్ డ్రామాతో పాటు లవ్, కామెడీ ఉంటూనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తూము నరసింహా, జామి శ్రీనివాసరావు నిర్మాతలుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇక ఈ సినిమాలో దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఆల్రెడీ ఈ ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ అయిపోగా ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని తన హిట్ సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ని ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తీసుకున్నారు ఆది. దీంతో అనూప్ తో ఆది, దర్శకుడు వీరభద్రమ్ దగ్గరుండి కూర్చొని మ్యూజిక్ ప్లాన్ చేయించుకుంటున్నారు.

గతంలో క్యూట్ లవ్ స్టోరీ సినిమాలతో మెప్పించిన లవ్ లీ హీరో ఆది సాయి కుమార్ నుంచి ఇటీవల వచ్చిన సినిమాలు ఆశించినంత ఫలితం రాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని ఫిక్స్ అయిపోయాడు. గతంలో తనకు చుట్టలబ్బాయ్‌ లాంటి హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ వీరభద్రమ్ చౌదరితో ఇటీవల ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ ని ప్రశాంతంగా గోవాలో సముద్రపు ఒడ్డున పెట్టుకోవడం గమనార్హం. గోవా నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్ ఫోటోని దర్శకుడు వీరభద్రమ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇక ఈ ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి జరగనుంది. హిట్ కాంబోతో పనిచేస్తున్న ఆది ఈసారి ఎలాగైనా హిట్ కొడతాడని భావిస్తున్నారు.

Related Posts

వెంకీ మామ ర్యాంపేజ్ కంటిన్యూ.. రూ.200 కోట్ల క్లబ్ లోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’

విక్టరీ వెంకటేశ్ (Venkatesh)‌ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) థియేటర్లలో జోరు చూపిస్తోంది. ఐశ్వర్యా రాజేశ్‌, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్‌ రోల్స్‌లో నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా…

బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన సంక్రాంతి ‘బుల్లిరాజు’!

సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో విక్టరీ వెంకటేశ్ (Venkatesh), అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో వెంకీ-అనిల్ కాంబో హ్యాట్రిక్ కొట్టింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ (Aishwarya…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *