నేనే రంగంలోకి దిగినా.. మీరు మొద్దు నిద్ర వీడరా? : అధికారులపై చంద్రబాబు ఫైర్

Mana Enadu:ఏపీలో వర్షాలు (AP Rains) తగ్గినా వరద ప్రాంతాలు ఇంకా ఆ ముంపు నుంచి తేరుకోలేదు. చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమనారం (సెప్టెంబరు 2వ తేదీ) మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులకు మరోసారి ధైర్యం చెప్పారు. అయితే పర్యటన అనంతరం చంద్రబాబు అధికారులతో సమీక్ష (AP CM Review On FLoods నిర్వహించారు. ఈ క్రమంలో పలువురి తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

వాళ్లను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది..

“రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ఇంకా వరద ముంపు (AP Floods Updates)లోనే ఉన్నాయి. వాళ్లను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. గూడూ గుడ్డా తిండికి దూరమై వాళ్లు తల్లడిల్లుతున్నారు. ఈ సమయంలో మనమంతా వాళ్లకు అండగా నిలవాలి. వీలైనంత త్వరగా ఈ వరదను తొలగించి వాళ్లు సాధారణ స్థితికి వచ్చేలా చేయాలి. వాళ్ల బాధను చూసి నేను చలించిపోయాను. అందుకే స్వయంగా రంగంలోకి దిగాను.

అలసత్వం వదిలించుకోకపోతే చర్యలు తప్పవు..

కానీ కొందరు అధికారుల తీరు మాత్రం చాలా దారుణంగా ఉంది. గత ప్రభుత్వంలో ఉన్న అలసత్వం వదిలించుకోకుంటే సహించేది లేదు. ఇంకా మొద్దు నిద్ర వీడకపోతే ఎలా?సహాయక చర్యల విషయంలో ఇప్పటికీ కొందరు అధికారులు నిర్లక్ష్యం వీడలేదు. అధికారుల పనితీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా నడుచుకోవాలి. అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యం జరుగుతోంది. చాలా మంది బాధితులు ఆకలితో అలమటిస్తున్నారు.” అంటూ అధికారులకు చంద్రబాబు (CM Chandrababu) క్లాస్‌ పీకారు.

కావాలనే చేస్తున్నారు..

బుడమేరు ముంపు ప్రాంతాల్లో డ్యూటీలో ఉన్న కొందరు ఉన్నతాధికారుల కారణంగా ఆహారం పంపిణీ (Food Distribution)లో జాప్యం జరిగిందని ఓ మంత్రి సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. పంపిణీ వేగంగా జరగకుండా ఉద్దేశపూర్వకంగానే ఆ అధికారులు వ్యవహరిస్తున్న విషయాన్ని గుర్తించినట్లు సీఎంతో చెప్పారు. వీఆర్‌లో ఉండి వరద బాధిత ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు డీఎస్పీ నుంచి డీఐజీ స్థాయి అధికారులు కొందరు వచ్చారనీ.. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఉద్దేశంతో వారు సహాయ చర్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ముఖ్యమంత్రికి తెలిపారు.

పని చేయాలని లేకపోతే ఇంటికెళ్లిపోండి

మంత్రి చెప్పిన సమాచారాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం చంద్రబాబు.. ఆయా అధికారులు డ్యూటీలో ఉన్న ప్రాంతంలో ఆహారం పంపిణీలో నెలకొన్న జాప్యంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. వీఆర్‌లో ఉన్న ఆ అధికారులను బందోబస్తులో భాగంగా అక్కడ విధుల్లో నియమించినట్లు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి తెలపగా.. పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లాలని ఆయన అన్నారు. ప్రజలు బాధల్లో ఉన్న సమయంలో ఇలాంటి పోకడలను సహించేది లేదని తేల్చి చెప్పారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *