Mana Enadu:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇవాళ బెంగళూరు వెళ్లిన ఆయన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయి.. వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చలు జరిపారు. ప్రధానంగా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణపై చర్చించారు. ఈ సందర్భంగా భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడి తెలుగు సినిమా ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేశారు.
ఏనుగుల గుంపు రైతుల పొలాలను ధ్వంసం చేస్తున్న అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కర్ణాటక నుంచి 6 కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలని పవన్ కోరారు. 40 ఏళ్ల క్రితం హీరో అడువులను సంరక్షించేవాడని, కానీ ఇప్పుడు అడవుల్లోని చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడని సంచలన కామెంట్స్ చేశారు. ఇది ప్రస్తుతం మన సినిమా పరిస్థితి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇది చూసి నెటిజన్లు ఓ స్టార్ హీరో సినిమాపైనే ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారని అంటున్నారు. ఇక పవన్ కల్యాణ్ కామెంట్స్ పై మీమ్స్ కూడా మొదలయ్యాయి. ఎంత మాటన్నాడు సార్ అంటూ మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీబిజీగా గడుపుతున్న పవన్ కల్యాణ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే త్వరలోనే కాస్త టైం తీసుకుని తను సైన్ చేసిన ప్రాజెక్టుల షూటింగ్ లో పాల్గొంటానని తెలిపారు. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీల షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేస్తానని చెప్పారు.






