ఖమ్మం ఫైర్‌బ్రాండ్, రాజ్యసభ సభ్యురాలు రేణుకచౌదరి ప్రధాన అనుచరుడిపై బధువారం అర్థరాత్రి కత్తులతో దాడి చేశారు. పరిస్థతి విషమంగా ఉండటంతో ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కొణిజర్ల మండలానికి చెందిన సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సైరంపలిల రామారావుపై దుండగులు కత్తులతో ఒక్కసారిగి విరుచకపడ్డారు. అర్థరాత్రి సమయంలో నిద్రనుంచి లేచి మూత్ర విసర్జనకు బయటకు రావడంతో కత్తులతో తెగబడ్డారు.
ఒక్కసారిగా కొణిజర్ల మండలంలో అలజడి నెలకొంది. రాజకీయ కోణంలోనే దాడులు జరిగాయా లేదా..? రియల్ వ్యాపారానికి సంబంధించిన లావాదేవాలు ఎమైనా ఉన్నాయానే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.