SS Rajmouli: జక్కన్న కొడుకు సిల్వర్​ స్క్రీన్​కు ఎంట్రీ

మలయాళంలో సూపర్ హిట్‌ అందుకున్న ప్రేమలు చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్‌ రైట్స్ ను జక్కన్న కుమారుడు కార్తీకేయ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాను మార్చి 8న తెలుగులో విడుదల చేసేందుకు రంగం సిద్దం అయినట్లు సమాచారం.

చాలా తక్కువ బడ్జెట్‌ రూ.3 కోట్ల తో ఈ సినిమా తెరకెక్కింది. కానీ ఇప్పటికే ఈ సినిమా సుమారు రూ. 60 కోట్ల కలెక్షన్‌ మార్కును దాటేసింది. భాగ్య నగరం బ్యాక్‌డ్రాప్‌ లో ఈ సినిమా రూపుదిద్దుకొంది. దీంతో ఈ చిత్రం తెలుగులోకి ఎప్పుడూ రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అలా కోరుకునే వారందరికి ఓ గుడ్‌ న్యూస్‌..ఏంటంటే ప్రేమలు చిత్రంలో త్వరలోనే తెలుగులోకి డబ్బింగ్‌ కాబోతుంది.

అంతేకాకుండా ఈ సినిమాతో తెలుగులోకి గ్రాండ్‌ గా ఎంట్రీ ఇస్తుంది మరెవరో కాదు.. జక్కన్న కుమారుడు కార్తీకేయ. ఈ చిత్రం ఓటీటీ ప్లే రిపోర్ట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తెలుగు హక్కులను ఎస్‌ఎస్‌ కార్తీకేయ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి డబ్బింగ్‌ పనులు ప్రారంభం అయినట్లు తెలుస్తుంది.

మరికొద్ది రోజుల్లోనే సినిమా విషయం గురించి అధికారిక ప్రకటన రావడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే నెల 8 న ప్రేమలు చిత్రాన్ని తెలుగులోకి విడుదల చేసేందుకు కార్తీకేయ ప్లాన్‌ చేస్తున్నట్లు సమచారం. ఈ చిత్రానికి గిరీశ్‌ ఏడీ డైరెక్టర్‌ గా ఉండగా.. నెల్స్‌ కే గఫూర్‌, మమితా బజు హీరోహీరోయిన్లుగా నటించారు.

ఈ చిత్రాన్ని నటుడు ఫాహద్‌ ఫాజిల్‌, దిలీశ్‌ పోతన్‌, శ్యామ్‌ పుష్కరన్‌ లు కలిసి నిర్మించారు. విష్ణు విజయ్‌ సంగీతం ఇచ్చారు. ఈ చిత్రంలో హీరో ఇంజినీరింగ్‌ చదువుతాడు. ఆ సమయంలో ఓ అమ్మాయి ని ప్రేమిస్తాడు. కానీ ఆ విషయం ఆమెతో చెప్పాడు. చదువు పూర్తయిన తరువాత విదేశాలకు వెళ్లాలి అనుకుంటాడు కానీ.. వెళ్లలేడు. దాంతో సొంత ఊరు నుంచి హైదరాబాద్‌ కి కోచింగ్‌ కోసం వస్తాడు. అక్కడ హీరోయిన్‌ తో ప్రేమలో పడతాడు. అయితే ఈ విషయం గురించి ఆమెతో చెబుతాడా.. వారి ప్రేమ సక్సెస్‌ అయ్యిందా లేదా అనేదే కథ.

Related Posts

మెస్మరైజింగ్ విజువల్స్.. దద్దరిల్లిన BGM.. ‘KINGDOM’ సౌండ్ ట్రాక్ ర్యాంపేజ్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘కింగ్‌డమ్‌ (KINGDOM)’. ఇటీవలే ఈ చిత్ర టీజర్ రిలీజై సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా ఒరిజినల్…

ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్.. బుల్లిరాజుకు షాకింగ్ రెమ్యునరేషన్

ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వచ్చిన సినిమాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *