RamCharan: గేమ్‌ చేంజర్‌ విడుదల పై మరో అప్‌డేట్‌!

గేమ్‌ చేంజర్ సినిమా ని ఈ ఏడాది డిసెంబర్‌ లేక వచ్చే ఏడాది అంటే 2025 సంక్రాంతికి విడుదల చేస్తారని వార్తలు రావడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కొద్ది రోజుల ముందు వరకు సెప్టెంబర్‌ ఆఖరికి సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ విడుదల కావడం లేదని తెలిసి నిరాశకు గురౌతున్నారు.

RamCharan: మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా డైరెక్టర్ శంకర్‌ తో కలిసి గేమ్‌ చేంజర్ అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమాని మొదలు పెట్టి ఇప్పటికే చాలా కాలం గడిచింది. కానీ ఇంకా షూటింగ్‌ పూర్తి కాలేదు. దీంతో మెగా అభిమానులు కొంచెం నిరాశకు గురవుతున్నారు.

సినిమా మొదలు పెట్టి ఇంతకాలం గడుస్తున్నప్పటికీ సినిమా విడుదల ఎప్పుడు అనే దాని మీద ఇప్పటి వరకు ఓ క్లారిటీ ఇవ్వలేదు చిత్రబృందం. చరణ్‌ అన్న సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ వచ్చి కూడా ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తి కావొస్తుంది.

ఈ క్రమంలో గేమ్‌ చేంజర్‌ సినిమా విడుదల పై ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం డైరెక్టర్‌ శంకర్‌ గేమ్‌ చేంజర్‌ సినిమాతో పాటు ఇండియన్ 2 సినిమా కూడా చేస్తున్నారు. చరణ్‌ సినిమా కంటే ముందుగా ఇండియన్‌ 2 సినిమాని ముందుగా పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.

దాంతో చరణ్ సినిమా మూవీ విడుదల వాయిదా పడే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గేమ్‌ చేంజర్ సినిమా ని ఈ ఏడాది డిసెంబర్‌ లేక వచ్చే ఏడాది అంటే 2025 సంక్రాంతికి విడుదల చేస్తారని వార్తలు రావడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కొద్ది రోజుల ముందు వరకు సెప్టెంబర్‌ ఆఖరికి అయినా సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరోసారి డిసెంబర్ లో సినిమా విడుదల ఉంటుందని తెలియడంతో మరోసారి అభిమానులు నిరాశకు గురయ్యారు.

అయితే చిత్ర బృందం మాత్రం డిసెంబర్‌ 2024 నాటికి సినిమాని పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ విషయం గురించి డైరెక్టర్‌ శంకర్‌, రామ్ చరణ్‌, దిల్‌ రాజు దీని గురించే మాట్లాడినట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ లో విడుదల చేసేందుకు ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం.

Related Posts

ఆ అద్భుతాన్ని అవతార్-3లో చూస్తారు : జేమ్స్‌ కామెరూన్‌

‘‘సినిమా లవర్స్ అంచనాలకు మించి అవతార్-3 (Avatar-3) సినిమా ఉంటుంది. ఈసారి మేం అందించబోయే విజువల్ వండర్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. గత రెండు సినిమాల్లో చూసినవి రిపీట్ కాకుండా మూడో పార్ట్ తెరకెక్కిస్తున్నాం. కొన్ని అడ్వెంచర్స్ తో మీ ముందుకు…

అనంతపురంలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ పార్టీ.. ఎప్పుడంటే?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *