మన Enadu: టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’. కళ్యాణ్ సంతోష్ దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమాకు హీరో రవితేజ ప్రొడ్యూస్ చేసాడు.
ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీలో సుందరం మాస్టర్‌గా వైవా హర్ష తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు.మిర్యాల మెట్ట ఊరివాళ్లతో ఇంగ్లీష్ మాట్లాడే సీన్స్ ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. కామెడీకి చిన్న సందేశాన్ని జోడించి దర్శకుడు ఈ చిత్రాని చక్కగా తెరకెక్కించాడు.. ఇక పాయింట్ బాగున్నా ‘సుందరం మాస్టర్’ కి ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు.. బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. థియేట్రికల్ రన్‌లో నాలుగు కోట్ల వరకు వసూళ్లను రాబట్టిన ఈ మూవీ నిర్మాతలకు మోస్తారు లాభాలను తెచ్చిపెట్టింది.
ఇక థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ‘సుందరం మాస్టర్’ డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ ఓటీటీ దక్కించుకుంది. మార్చి 22 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం..ఈ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.