ఓటీటీలోకి ‘ఊరిపేరు భైరవకోన’

మన Enadu: గత నెలలో విడుదలై అభిమానులను అలరించిన సోషియో ఫాంటసీ మూవీ ‘ఊరిపేరు భైరవకోన’… చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. సందీప్ కిషన్, కావ్యథాపర్, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ ను రాబట్టింది. ఇప్పటికీ అక్కడక్కడ థియేటర్లలో ఈ మూవీ ఆడుతూనే ఉంది. ఇంతలోనే అకస్మాత్తుగా ఓటీటీలోకి రావడం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఊరిపేరు భైరవకోన స్ట్రీమింగ్ అవుతోంది. ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాజేశ్ దండా ఈ మూవీని నిర్మించారు. విఐ ఆనంద్ డైరెక్ట్ చేశారు.

Share post:

లేటెస్ట్