Richest Families: అత్యంత రిచెస్ట్ ఫ్యామిలీస్ ఇవే.. సంపద తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Mana Enadu:ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్(Elon musk) అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం(Richest Family)ఎవరిదో తెలుసా? ఈ కుటుంబం విలాసవంతమైన జీవితం గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 2024 వరకు చూసుకుంటే ఈ ఫ్యామిలీ మొత్తం నికర ఆస్తుల విలువ రూ. 25,33,113 కోట్లుగా అంచనా. ఈ మొత్తం ఎలోన్ మస్క్ నికర విలువ రూ.14,87,360 కోట్ల కంటే ఎక్కడా ఎక్కువేనట.

 షేక్ పేరు వింటే షాకవ్వాల్సిందే..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నయన్ కుటుంబానికి ఉన్న ఆస్తుల లెక్కలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరే కాదు యావత్ ప్రపంచంలోని ప్రతీ ఒక్కరు ఇప్పుడు ఆ రిచ్ ఫ్యామిలీ గురించే చర్చించుకుంటున్నారు. ఆ కుటుంబానికి 8 ప్రైవేట్ జెట్‌లు, సుమారు 700 లగ్జరీ కార్లతో పాటు పర్సనల్ షిప్ ఉంది. ఇందులో గోల్ఫ్ కూడా ఆడవచ్చు.

మరి భారత్‌లో ఎవరంటే..

భారత్‌లో అత్యంత ధనిక కుటుంబం ఎవరిదో మీకు ఆల్రేడీ తెలిసే ఉంటుంది. అదేనండి ఇటీవల వేల కోట్లు ఖర్చు చేసి మరీ పెళ్లి జరిపించారు కదా.. గుర్తొంచిందా.. అదే అంబానీ ఫ్యామిలీ భారత్‌లే అంబానీ ఫ్యామిలీ(Ambani) ఆదాయం దాదాపు రూ.25,75,100 కోట్లు. ఈ ఫ్యామిలీ భారత్‌(India)లో రిచెస్ట్ ఫ్యామిలీ అని బార్ క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా బిజినెస్ రిపోర్టు(Barclays Private Clients Hurun India Most Valuable Family Businesses list)లో తేలిందట. వీరి తర్వాత బజాజ్(Bajaj) కుటుంబం (రూ.7.12 లక్షల కోట్లు), మంగళం బిర్లా (రూ.5.38 లక్షల కోట్లు), జిందాల్ ఫ్యామిలీ (రూ.4.71 లక్షల కోట్లు) ఉన్నాయట.

ఇండియాలో టాప్ 10 ఫ్యామిలీస్ ఇవే

1. అంబానీ ఫ్యామిలీ
2. బజాజ్ కుటుంబం
3. కుమార్ మంగళం బిర్లా ఫ్యామిలీ
4. జిందాల్ ఫ్యామిలీ
5. నాడార్ కుటుంబం
6. మహీంద్రా ఫ్యామిలీ
7. దనీ,చోక్సీ, వకీల్ ఫ్యామిలీలు
8. ప్రేమ్జీ కుటుంబం
9. రాజీవ్ సింగ్ ఫ్యామిలీ
10. మురగప్పా ఫ్యామిలీ

 

Related Posts

Gold & Silver Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు (Gold Rate) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ, జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. ఇండియా-అమెరికా మధ్య టారిఫ్‌ల ప్రభావం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్‌(Dollar) క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరల (Gold…

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. కేజీ వెండి రేటెంతంటే?

బంగారం ధరలు(Gold Rates) రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad Bullion Market)లో ఈ రోజు (ఆగస్టు 29) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,03,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *