Good News|గుడ్ న్యూస్.. ఇక నుంచి కరెంట్ బిల్లు గూగుల్ పేలో కట్టొచ్చు 

ManaEnadu:విద్యుత్ వినియోగదారులకు అలర్ట్. ఇటీవల కరెంట్ బిల్లును సదరు విద్యుత్ సంస్థలకు సంబంధించిన యాప్స్ లోనే కట్టాలని మార్గదర్శకాలు విడుదలైన విషయం తెలిసిందే. థర్డ్ పార్టీ యాప్స్ అయిన ఫోన్​ పే, గూగుల్​ పే, పేటీఎం వంటి యాప్స్​ ద్వారా కరెంట్ బిల్ పే చేయొద్దని ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయంపై విద్యుత్ సంస్థలు వెనక్కి తగ్గాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు మునుపటి లాగే యూపీఐ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించొచ్చని భారత్ బిల్ పేమెంట్ వెల్లడించింది.

కరెంటు బిల్లుల చెల్లింపుల్లో భద్రతకు పెద్దపీట వేస్తూ బిల్లు చెల్లింపులన్నీ భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ద్వారా జరగాలని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఇటీవల  నిర్దేశించింది. చెల్లింపులన్నీ భారత్‌ బిల్‌ పేమెంట్ సిస్టమ్‌ ద్వారానే జరగాలని ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలను జులై 1వ తేదీ నుంచి తీసువచ్చింది. ఇందులో భాగంగా భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను బిల్లర్లు యాక్టివేట్‌ చేసుకోవాలని తెలిపింది.

అయితే తెలుగు రాష్ట్రాల విద్యుత్తు సంస్థలు అయిన తెలంగాణలోని టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీసీపీడీసీఎల్‌లు మొదట బీబీపీఎస్ లో చేరకుండా సదరు సంస్థల యాప్ ల నుంచే బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశాయి. గత నెల బిల్లులను వినియోగదారులు ఈ సంస్థల యాప్ ల ద్వారానే చెల్లించారు. అయితే ఇప్పుడు బిల్లుల చెల్లింపులను ఈజీ చేసేందుకు ఈ సంస్థలన్నీ  భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టం(బీబీపీఎస్‌)లో చేరాయి.

ఇక డిస్కంలు బీబీపీఎస్‌లోకి రావడంతో మళ్లీ యూపీఐ ల ద్వారా చెల్లింపులు మొదలయ్యాయి.  బ్యాంకులు, ఫిన్‌టెక్‌ యాప్‌లు, వెబ్‌సైట్‌లతోపాటు బీబీపీఎస్‌ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల ద్వారానూ బిల్లులను సురక్షితంగా చెల్లించవచ్చని  భారత్‌ బిల్‌ పే లిమిటెడ్‌(బీబీఎల్‌) సీఈవో నూపూర్‌ చతుర్వేది వెల్లడించారు.  గూగుల్‌ పే, అమెజాన్‌ పే ద్వారా కరెంటు బిల్లులు చెల్లించవచ్చని తెలిపారు. ఈ నిర్ణయంపై విద్యుత్ వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *