Mana Enadu: ఆధార్ కార్డు(Aadhaar Card).. మనకు దాదాపు అన్ని అవసరాలకు అవసరం. బ్యాంకు అకౌంట్(Bank Account) ఓపెన్ చేయాలన్నా, పాన్ కార్డు(Pan card) తీసుకోవాలన్నా, ఇంటి అడ్రస్(Address) తెలుసుకోవాలన్నా.. చివరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ పథకానికీ(Free bus scheme) ఆధార్ కార్డు కావాల్సిందే. అలాగే మనం ఉపయోగించే ఏ ఫోన్లలోనైనా సిమ్ కార్డు(Sim Cards) కావాలన్నా యునిక్ ఐడెంటిఫికేషన్ నంబర్-ఆధార్ కార్డు(UIDAI) కావాల్సిందే. అయితే ఇతర కార్డుల్లా ఆధార్ కాదు. ఏ వ్యక్తికైనా ఒక్కటే ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటుంది. సాధారణంగా ప్రతి ఆధార్ కార్డుదారుడికి వారి ఫోన్ నంబర్(Phone Number)కు ఏదో ఒకటి లింక్ అయి ఉంటుంది. అలాగే మీ ఆధార్ కార్డు ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయి ఉన్నాయో మీకు తెలుసా? ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? ఒకవేళ అలా చేసుకోకపోతే వెంటనే తెలుసుకోండి. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఆధార్ కార్డు ద్వారా అనేక మోసాలకు పాల్పడుతున్నారు. కొన్నిసార్లు మనం ఎంత తెలివిగా వ్యవహరించినా మనల్ని బురిడీ కొట్టించేందుకు చూస్తూనే ఉంటారు. అందుకే మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచింది.
ఏపీలో ఒకే వ్యక్తి పేరిట 658 సిమ్ కార్డులు
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు 658 సిమ్ కార్డుల(SIM cards in bulk)ను ఒక ఆధార్ కార్డ్‌తో లింక్ చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. దాంతో ఆయా సిమ్ కార్డులను వెంటనే రద్దు చేయాలని సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లకు పోలీసులు లేఖ రాశారని ఓ రిపోర్టు తెలిపింది. ఓ వ్యక్తి పేరుతో సిమ్‌కార్డులు రిజిష్టర్ కాగా, మొబైల్ ఫోన్లు, కియోస్క్‌లు విక్రయించే దుకాణాలకు పంపిణీ చేసేవాడు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం Department of Telecommunications (DoT) regulation నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డుపై 9 సిమ్ కార్డులను కలిగి ఉండేందుకు పర్మిషన్ ఉంటుంది. ఒక ఆధార్ నంబర్ ఇచ్చి మల్టీ సిమ్ నెట్‌వర్క్ కనెక్షన్లు తీసుకోవచ్చు. అయితే, ఈ నిబంధన దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సిమ్ కార్డు కనెక్షన్ కోసం చాలామంది ఆధార్ కార్డు వివరాలను ఇస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి తెలియకుండానే ఆధార్ కార్డు వివరాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఈ పోర్టల్‌లో లాగిన్ అవడం ద్వారా తెలుసుకోవచ్చు
అయితే మీకు మీ ఆధార్ కార్డు విషయంలో ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అయితే ఇలా చెక్ చేసుకోవచ్చు. మీ పేరుతో ఎన్ని SIM కార్డ్‌లు వాడుతున్నారో తెలుసుకోవాలంటే DoT వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. tafcop.dgtelecom.gov.in (Sanchar Sathi) పోర్టర్‌లో లాగిన్ అయి మీ పేరుతో జారీ చేసిన SIM కార్డ్‌ల సంఖ్యను తెలుసుకోవడమే కాకుండా, పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్‌ను బ్లాక్ చేయవచ్చు. Sanchar Sathi(https://sancharsaathi.gov.in/) వెబ్‌సైట్‌కి లాగిన్ అయిన తర్వాత వినియోగదారులు రెండు లింక్‌ల ద్వారా చెక్ చేసుకోవచ్చు. మీ పోగొట్టుకున్న/దొంగిలించిన మొబైల్‌ని బ్లాక్ చేయండి. మీ మొబైల్ కనెక్షన్‌లు ఎన్ని ఉన్నాయో తెలుసుకోండి. రెండో లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా వినియోగదారుని 10-అంకెల మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్, మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ పేజీలో వినియోగదారు పేరుతో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ల వివరాలు ఉంటాయి. వారి ఆధార్ కార్డులో ఏదైనా అన్‌నౌన్ నంబర్ ఉందని గుర్తిస్తే.. వెంటనే బ్లాక్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇలా మీ ఆధార్ కార్డు నంబర్‌పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో చాలా సులభంగా తెలుసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ట్రై చేసి చూడండి.. సేఫ్‌గా ఉండండి.