Mana Enadu: ఇటీవల మెన్స్ T20 World Cupను రోహిత్ సేన తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అద్భుతమైన ఆటతీరుతో 17 ఏళ్ల తరువాత పొట్టి ప్రపంచ కప్ విజేతగా భారత్ అవతరించింది. తాజాగా మహిళల టీ20 ప్రపంచ కప్ కొత్త షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. UAE వేదికగా మహిళల ప్రపంచ కప్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 20 వరకు టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది. తొలి మ్యాచులో బంగ్లాదేశ్, స్కాంట్లాండ్ జట్లు తలపడనున్నాయి.
మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. గ్రూప్ బీలో వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాంట్లాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు ఉన్నాయి. ఈ వరల్డ్ కప్‌లో భాగంగా 23 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్రతి గ్రూప్‌లో మొదటి 2 స్థానాల్లో నిలిచిన టీమ్స్ సెమీస్ (Semi Final)కు చేరుకుంటాయి. సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు అక్టోబర్ 20న ఫైనల్లో తలపడతాయి. టీ20 వరల్డ్ కప్ ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉంది. కానీ అక్కడ రాజకీయ అల్లర్ల కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు తరలించాల్సి వచ్చింది.
భారత్ షెడ్యూల్ ఇదే..
భారత్ అక్టోబర్ 4న న్యూజిలాండ్, 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను అక్టోబర్ 6న దుబాయ్‌లో ఢీకొంటుంది. అక్టోబర్ 17, 18 తేదీల్లో సెమీఫైనల్స్ జరుగుతాయి. మొత్తం మ్యాచులను దుబాయ్, షార్జా వేదికగా నిర్వహించనున్నారు. కాగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు వార్మప్ మ్యాచులు జరుగుతాయి. భారత్ 2020లో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆసీస్ ఈ టోర్నీలో ఏకంగా ఎనిమిసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.