ఈనెల 11వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం రానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది.
భద్రాచలంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ముందుగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శనం చేసుకుని అనంతరం భద్రాచలంలో జరిగే పబ్లిక్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇదే మీటింగ్‌లో భద్రాచలం ఎమ్మెల్యేతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు బీఆర్ ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం తీసుకునే అవకాశం ఉంది.