ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్

ఖమ్మం కాంగ్రెస్‌లో ఒక్కసారిగా వర్గ పోరు భగ్గుమంది. మహిళా నేతల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావ్‌ చేతిలో మైక్‌ లాక్కుని భట్టికి అనుకూలంగా సౌజన్య నినాదాలు చెప్పట్టారు. వర్గాలుగా విడిపోయి జై పొంగులేటి, జై తుమ్మల, జై భట్టి అంటూ నినాదాలు చేపట్టారు.

Khammam Congress: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఖమ్మంలో ఆ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేతలు. తాజాగా ఖమ్మం కాంగ్రెస్‌లో వర్గ పోరు భగ్గుమంది. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావ్‌, జిల్లా అధ్యక్షురాలు సౌజన్య మధ్య గొడవ వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళా నేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోవర్గాలుగా విడిపోయి.. జై పొంగులేటి, జై తుమ్మల, జై భట్టి అంటూ నినాదాలు చేపట్టారు అక్కడి మహిళా నేతలు. సునీతా రావ్‌ చేతిలో మైక్‌ లాక్కుని భట్టికి అనుకూలంగా సౌజన్య నినాదాలు చెప్పట్టారు. దీంతో అక్కడి వచ్చిన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అక్కడ ఏమైతుందో తెలియక తలపట్టుకున్నారు.

Share post:

లేటెస్ట్