Khammam:స్మార్ట్ కిడ్జ్ లో ఆనందోత్సవాలతో గ్రాడ్యుయేషన్ డే.

 

Smart Kidzస్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో సోమవారం ఆందోత్సవాలతో గ్రాడ్యుయేషన్ డే జరిగింది. పాఠశాలలో చివరి తరగతి 5వ తరగతి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే పట్టాలు అందించారు. నర్సరీ నుంచి మొదలుకొని గత 8 సంవత్సరాలుగా వివిధ అన్ని తరగతులు చదివి 5వ తరగతి విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు పట్టాలు అందుకొని సంబురంగా గడిపారు.
ఒలంపియాడ్ లలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ బహుకరించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా తమ పాఠశాలలో విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించామని తెలిపారు. ప్రతి ఏటా ఇన్స్పైర్ సైన్స్ ఎక్స్పో తో పాటు క్రీడలు, సాంస్కృతికం, పర్వదినాల నిర్వహణ, మహనీయుల జయంతోత్సవాలు, సాంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించే ఉత్సవాలు , స్కూల్ డే ల నిర్వహణ తదితర అన్ని అంశాలలో విద్యార్థులను చదువుల్లో ఆల్ రౌండర్లుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమకు వెన్నుదన్నుగా నిలిచి అనునిత్యం ప్రోత్సహించడం మధురానుభూతిని కలిగిస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Share post:

లేటెస్ట్