BREAKING: పైనాన్స్​ వ్యాపారుల అరాచాకం.. అప్పు తీర్చలేదని కారుకు నిప్పు

Narsing:నార్సింగ్ ప్రాంతానికి చెందిన నీరజ్ వ్యాపారికి కార్లు అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే అతడు లాంబోర్ఘిని కంపెనీకి చెందిన స్పోర్ట్స్ కొనాలని నిర్ణయించకున్నాడు. అయితే, కొత్త కారు కొనాలంటే రూ. కోట్లలో ఖర్చు అవుతోందని చెప్పి 2009 మోడల్‌కు చెందిన సెంకండ్ హ్యాండ్ కారును రూ.80 లక్షలు ఫైనాన్సర్ల దగ్గర అప్పు చేసి తీసుకున్నాడు. అయితే, కారును కొన్నాళ్లు నడిపిన నీరజ్.. దానిని అమ్మేద్దామంటూ తనకు తెలిసిన వ్యక్తి అయాన్‌కు విషయం చెప్పాడు.

దీంతో మొఘల్‌పురాకు చెందిన అయాన్ స్నేహితుడు అమన్ మంచి బేరం తీసుకొచ్చాడు. పార్టీ కారును చూడాలనుకుంటున్నారని అమన్, అయాన్‌కు తెలుపాడు. అనంతరం మామిడిపల్లి నుంచి శంషాబాద్ రూట్‌కు వెళ్లే రహదారిలో ఉన్న ఫాం హౌజ్‌కు తీసుకురావాలంటూ అహ్మద్ అనే వ్యక్తి కోరాడు. నీరజ్ దగ్గర కారు తీసుకుని అమన్ మరో స్నేహితుడు హందాన్‌తో కలిసి ఫాం హౌజ్‌కు వెళుతూ.. మార్గమధ్యలో జల్పల్లిలో వివేకానంద విగ్రహం దగ్గర కారను ఆపారు. ఈ క్రమంలోనే అహ్మద్ అనే వ్యక్తి, మరికొందరితో అక్కడి వచ్చాడు. నీరజ్ ఎక్కడా అంటూ అమన్‌ను ప్రశ్నించారు.

అతడు తమకు డబ్బు ఇవ్వాలంటూ వారిపై దుర్భాషలాడారు. అనంతరం అమన్, నీరజ్‌ను పిలిపిస్తామని చెప్పినా వినకుండా.. కారు మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఇక చేసేదేమి లేక నీరజ్, అమన్ వెంటనే డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులు ఫిర్యాదు చేశారు. పహాడీ షరీఫ్(Pahadi Sharif) పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే కారు పూర్తిగా దగ్ధమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేపడుతున్నారు.

Share post:

లేటెస్ట్